Dulquer Salmaan :మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తొలిసారి సోలో హీరోగా తెలుగులో నేరుగా నటించిన చిత్రం సీతారామం (Sitaramam). హను రాఘవపూడి (Hanu raghavapudi)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunhal thakur) హీరోయిన్ గా నటించినది. ఇకపోతే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి గుర్తింపు అందించింది. ఈ సినిమా కమర్షియల్ గా మాత్రమే కాకుండా లవ్ స్టోరీస్ లో కల్ట్ క్లాసిక్ గా కూడా నిలిచిపోయింది..ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ వద్ద 46 కోట్ల రూపాయల షేర్, రూ .98 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.. అయితే ఇప్పుడు ఈ వసూళ్ల ను దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం లక్కీ భాస్కర్ (Lucky bhaskar) దాటేసింది అని చెప్పవచ్చు.
బ్రేక్ ఈవెన్ అందుకున్న లక్కీ భాస్కర్..
వెంకీ అట్లూరి (Venki Atluri) దర్శకత్వంలో మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) హీరోయిన్గా తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమా దీపావళి సందర్భంగా విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాలలో తక్కువని ఈ సినిమా దక్కించుకుంది. కానీ అన్ని ప్రాంతాలలో కూడా నూటికి నూరు శాతం బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది అని సమాచారం. ఈ యొక్క 13 రోజులకు గానూ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రాంతాలవారీగా ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు చూద్దాం.
నైజాం – రూ.8.35కోట్లు
సీడెడ్ – రూ.2.50కోట్లు
కోస్తాంధ్ర – రూ.7.25కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి రూ.18కోట్ల షేర్, రూ. 30కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
కేరళ – రూ.17.60కోట్లు
కర్ణాటక – రూ.5కోట్లు
తమిళనాడు – రూ.10.50కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.2కోట్లు
ఓవర్సీస్ – రూ.25కోట్లు
ఇక ప్రపంచవ్యాప్తంగా 11 రోజులకు కలిపి రూ.96కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ , 44కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు రాబట్టింది లక్కీ భాస్కర్ చిత్రం. ఇకపోతే వీకెండ్ ముగిసే సరికి 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు A సెంటర్స్ లో ఇంకా మంచి రన్ వచ్చే అవకాశం ఉండడంతో ఫుల్ రన్ లో మరో రూ.20కోట్లు అదనంగా వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టాలీవుడ్ కి రుణపడి వుండాల్సిందే..
ఇకపోతే లక్కీ భాస్కర్ సినిమాతో రూ.100 కోట్లకి అత్యంత చేరువలో ఉన్న దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ సినీ పరిశ్రమకు రుణపడి ఉంటారనడంలో సందేహం లేదు. ఇకపోతే మలయాళం ఎక్కడైనా దుల్కర్ సల్మాన్ తమిళ్ ఇండస్ట్రీలో కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు. నటుడు గానే కాకుండా నేపథ్య గాయకుడిగా బిజినెస్ మాన్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే మలయాళం, తమిళ్ భాషలలో ఎన్ని చిత్రాలు చేసినా ఆయన కల నెరవెరలేదు. కానీ తెలుగులో చేసిన సినిమాలతో భారీ పాపులారిటీ అందుకోవడమే కాదు రూ.100 కోట్లు అందుకొని తన కలను కూడా నెరవేర్చుకున్నారు దుల్కర్ సల్మాన్. ఏది ఏమైనా మలయాళం ఇండస్ట్రీ నటుడుకి తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టారు అని చెప్పవచ్చు.