Intinti Ramayanam Today Episode November 13th : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే… అవని పై కోపంతో ఉన్న అక్షయ్ అవినికి దూరంగా ఉంటాడు. అవని ఆపుతుంది. తనతోనే రూమ్ లో ఉండాలని అనుకుంటుంది. మీరు పైన పడుకోండి నేను కింద పడుకుంటాను అని అంటుంది.. పార్వతి, రాజేంద్ర ప్రసాద్ గుడికి రెడీ అవ్వాలని అనుకోని కిందకు వస్తారు. ప్రణవి డ్రెస్ వేసుకొని వస్తుంది. అందరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ పార్వతి అందరం కలిసి పోయాము కోమలి వినోద్ లు కలిసిపోయరని సంతోషంతో మొక్కు తీర్చుకోవాలని అనుకుంటుంది. అందరూ సంతోషంగా గుడిలోపలికి వెళ్తారు. అక్కడ ప్రణవి ప్రదక్షిణలు చేసేందుకు అక్కడకు వెళ్తుంది. చక్రధర ప్లాన్ ప్రకారం కొందరు పోకిరిలు తనని ఏడ్పిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. గుడిలోకి వెళ్లిన అందరు సంతోషంగా ఉంటారు. అది చూసి ఓర్వలేక పోతుంది పల్లవి.. ఎలాగైనా ఈ సంతోషాన్ని దూరం చెయ్యాలని అనుకుంటుంది. అందరు పూజలో నిమగ్నమయ్యారు. ఇక ఇప్పుడు మనం ప్లాన్ వర్కౌట్ చెయ్యాలని చక్రధర్తో అంటుంది. చక్రధర్ ప్రణవిని ఏడ్పించాలని ఇద్దరు కుర్రాళ్ళను గుడిలోకి పంపిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ప్రణవిని కావాలనే ఏడపిస్తారు. అసభ్యంగా బిహేవ్ చేస్తారు. అంతేకాదు ప్రణవి చున్నీని లాక్కుంటారు. ఇక ప్రణవి వాళ్ళను చూసి భయంతో పరుగులు తీస్తుంది. గుడిలో పూజలో ఉన్న తన వాళ్లకు చెబుతుంది. ఇద్దరు వెదవలు తనను అసభ్యంగా మాట్లాడి ఏడ్పినుంచినట్లు చెబుతుంది. ఆ మాట వినగానే అక్షయ్, కమల్ కోపంగా ఎవరా వెదవలు పద అని వెళ్తారు.
ఇక ప్రణవి వాళ్ళతో వెళుతుంది. భరత్ ను ప్రసాదం కోసం గుడికి రమ్మని చెబుతుంది పల్లవి.. అతను రాగానే లోపలికి రమ్మని అడ్రెస్ చెబుతుంది. అప్పుడే ఆ టీజ్ చేసిన కుర్రాళ్లు ప్రణవి చున్నీని భరత్ కు ఇచ్చి ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. అక్షయ్, కమల్ తో పాటుగా అందరు అక్కడికి వెళ్తారు. అక్షయ్ అ చిన్ని నీదే కదా ప్రణవి అని అడుగుతాడు. ప్రణవి దానికి అవునన్నయ్య నాదే అని అంటుంది. అక్షయ చున్నీని భరత్ చేతి నుంచి లాక్కొని భరత్ నువ్వు నాలుగు దెబ్బలు కొడతాడు. కమల్గూడ భారత్ ను కొడతాడు. అవని కంగారు పడుతూ ఉంటుంది. ఇలాంటి వెధవలకి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా నాలుగు తగిలియాలని పార్వతి సపోర్ట్ చేస్తుంటుంది. అవని అతని కొట్టొద్దండి అతను నా తమ్ముడు అనేసి అంటుంది. ప్రణవి నేర్పించమని కొట్టొద్దు అని చెప్తావ్ ఏంటి అని పార్వతి మండిపడుతుంది. అందరూ అవనీని తిడతారు.
నీ తమ్ముడా నీ తమ్ముడు ఏంటి అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. అవని నిజం చెప్పబోతుంటే భరత్ ఆపుతాడు. మేమిద్దరం ఒకే అనాధశ్రమంలో పెరిగాము అందుకే అక్క అని పిలుస్తానని భరత్ చెప్తాడు. ఇక అవని పాపం తనకేం తెలియదండి తన్ను ఎవరో కావాలి ఇలా చేశారు అనేసి అనగానే అక్షయ్ మాత్రం నమ్మడు. గుళ్లో ఒక్కోక్కరు ఒక్కో మాట అంటారు. ఈ పోలీసులకు అప్పజెప్పితే పోలీసులే అన్ని చూసుకుంటారని గుళ్లో వాళ్ళు అంటారు. అవని రాజేంద్రప్రసాద్ తో వాడు చాలా మంచివాడు మామయ్య ఏదో పొరపాటు జరిగింది నేను చెప్తున్నాను కదా అనేసి అన్నా కూడా అతను వినడు. భరత్ నీ పోలీసులకు అప్పజెప్పాలని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం చెప్పి కంప్లైంట్ ఇస్తారు. ఈ భరత్ దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతుంది. ఎవరో కావాలని నా చేతులు చున్నీ పెట్టారు అక్క అని అంటాడు. నువ్వు అమ్మని వదిలేసి గుడికి ఎందుకు వచ్చావు అని అవని అడుగుతుంది. నాకు తెలిసిన ఒక ఆవిడ ప్రసాదం ఇస్తామంటే నేను వచ్చాను భరత్ చెబుతాడు. ఇక అందరూ ఇంటికి వెళ్లి పోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి భరత్ నీ పోలీసులు ఎలా కొడతారో చెప్తుంది. ఈ అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అందరూ భోజనం చేస్తుంటే అవని రాదు అవని ఎక్కడ అని రాజేంద్రప్రసాద్ అక్షయ్ అని అడుగుతాడు. అవని పోలీస్ స్టేషన్ కి లాయర్ తో వెళ్లి భరత్ను విడిపిస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అక్షయ్ ఏ గోల చేస్తాడో చూడాలి..