Thug Life: భాషావివాదం మధ్యలోనే కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ రిలీజ్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటించారు. సాధారణంగా అయితే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే తెచ్చుకొని ఉండేది. కానీ, కమల్ చేసిన ఒక చిన్న తప్పు ఈ సినిమాపై ఎక్కడలేని నెగిటివిటిని క్రియేట్ చేసింది. కన్నడ.. తమిళ్ నుంచి పుట్టింది అని కమల్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడిగులు కన్నెర్ర చేసి కర్ణాటకలో థగ్ లైఫ్ ను రిలీజ్ చేయమని చెప్పుకొచ్చారు.
కమల్ సారీ చెప్తే ఇదంతా సద్దుమణిగేది. కానీ, కమల్ మాత్రం ఎక్కడా తగ్గకుండా నేనెందుకు సారీ చెప్పాలి. నేనేం తప్పు అనలేదు అంటూ అనడంతో కన్నడ బ్యాచ్ .. ఈ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయడానికి ససేమిరా అంది. కన్నడ కాకపోతే మిగతా భాషల్లో రిలీజ్ చేస్తాను అని కమల్.. అదే పట్టుదలతో నేడు థగ్ లైఫ్ సినిమాను కన్నడ కాకుండా మిగతా భాషల్లో రిలీజ్ చేశారు. ఈ వివాదం వలన థగ్ లైఫ్ కు హైప్ వచ్చినా.. కథలో దమ్ము లేకపోతే ఎవరు థియేటర్ కు వెళ్లరు. నాయకుడు లాంటి సినిమా తరువాత మణిరత్నం – కమల్ హాసన్ కాంబో వస్తుంది అని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురుచూసారు. కానీ, సినిమా చూసాక ఆ ఎదురుచూపులు వెస్ట్ అయ్యినట్లు చెప్పుకొస్తున్నారు.
అవును.. ఈ సినిమా ఉదయం నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంటుంది. ఇండియన్ 2 కన్నా ఘోరంగా ఉందని, మణిరత్నం సినిమా అంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కమల్ ఫేస్ కళ తప్పిందని, ఎక్స్ ప్రెషన్స్ ఏమి బాలేదని పెదవి విరుస్తున్నారు. ఇక శింబు పాత్ర అయితే అంచనాలను అందుకోలేదని చెప్పుకొస్తున్నారు. ఇక త్రిష పాత్ర అయితే అసలు ఎందుకు పెట్టారో అర్ధం కావడం లేదని అంటున్నారు. సినిమా రిలీజ్ తరువాత దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శింబు పాత్రకు మొదట దుల్కర్ ను అనుకున్నారు. అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ, డేట్స్ అడ్జస్ట్ కాక.. దుల్కర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
దుల్కర్ మాత్రమే కాదు మరో స్టార్ హీరో జయం రవి కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మొదట మణిరత్నం అనుకున్న కథ వేరు. క్యాస్టింగ్ కూడా అందుకు తగ్గట్టుగానే చేశారు. కానీ, మధ్యలో ఏమైందో ఏమో కానీ.. ముందు దుల్కర్, తరువాత జయం రవి సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ చూసాక వారు తప్పుకొని మంచి పని చేశారు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తమిళ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా చూసి పండగ చేసుకుంటున్నారు. మరి మొదటి రోజే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఎలాంటి కలక్షన్స్ రాబడుతుందో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.