Ravi Teja New Movie : రవితేజ (Raviteja), చిరంజీవి (Chiranjeevi) కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చి ఎంత విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడే కాదు గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వీరిద్దరూ అమీ తుమీ అనడానికి సిద్ధం అయిపోయారు. అటు చిరంజీవి ఇటు రవితేజ ఎవరికి వారు తమ సోలో సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
2026 సంక్రాంతి టార్గెట్ గా చిరంజీవి 157 మూవీ..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట మల్లిడి(Vasista mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. అంతలోనే మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో తన 157వ సినిమాను ఫిక్స్ చేశారు. ఈ సినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా 2026 లో విడుదల చేయబోతున్నట్లు డేట్ కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 2026 జనవరి 10వ తేదీన చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మెగా 157 రాబోతోంది.
అన్నయ్యకు పోటీగా రవితేజ.. కొత్త మూవీ అనౌన్స్..
ఇటు రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రవితేజ తో పాటు మేకర్స్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సినిమా తర్వాత రవితేజ తన 76వ సినిమాని ‘RT76’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. జూన్ 5వ తేదీన హైదరాబాదులో గ్రాండ్ గా పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకి దర్శకుడు కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నట్లు తాజాగా మేకర్స్ పోస్టర్తో సహా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో సూట్ వేసుకొని సాఫీగా సోఫాలో పడుకొని, ఒక చేతిలో స్పానిష్ పుస్తకం మరొక చేతిలో వైన్ బాటిల్ తో కనిపించారు రవితేజ.
ALSO READ:Anushka Shetty: హీరోయిన్ అనుష్క వల్ల 40 మందికి యాక్సిడెంట్.. అసలు ఏం జరిగిందంటే..?
వచ్చే యేడాది సంక్రాంతికి 4 సినిమాలు ఫిక్స్..
ఇక వీరితోపాటు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ‘అనగనగా ఒక రాజు’ అలాగే తమిళ్ నుంచి విజయ్ దళపతి (Vijay Thalapathi) లాస్ట్ మూవీ ‘జననాయగన్’ మూవీ కూడా 2026 సంక్రాంతికే రిలీజ్ అవుతుంది. ఇలా మొత్తం నాలుగు సినిమాలు సంక్రాంతిని ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నాయి. మరి ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా విజయం సాధిస్తుంది? ముఖ్యంగా చిరంజీవి – రవితేజ మధ్య పోటీ ఏర్పడనుండి. పోటీ అయితే సరే వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు? అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.