NVS Recruitment: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారికి ఇది బంపర్ ఆఫర్ న్యూస్. నవదోయ విద్యాలయ సమితి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి జీతం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్ కట్ గా చూద్దాం.
నవోదయ విద్యాలయ సమితి నుంచి 146 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మే 5న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నవోదయ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 146
నవోదయ విద్యాలయ సమితిలో హాస్టల్ సూపరెండెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
హాస్టల్ సూపరెండెంట్ : 146 ఉద్యోగాలు (73 ఉద్యోగాలు పురుషులకు, 73 ఉద్యోగాలు మహిళలకు)
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 25
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 5
దరఖాస్తు విధానం: నవోదయ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 35 నుంచి 62 ఏళ్ల మధ్య వయస్సులో ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.35,750 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://navodaya.gov.in
అప్లికేషన్ లింక్: https://navodaya.gov.in/nvs/ro/Pune/en/home/index.html
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.35,750 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 146
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 5
జీతం: రూ.35,750 జీతం ఉంటుంది.