BigTV English

Rajkumar Hirani : డంకీ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది.. దెబ్బకు సక్సెస్‌ఫుల్ సీక్వెల్ క్యాన్సిల్..?

Rajkumar Hirani : డంకీ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది.. దెబ్బకు సక్సెస్‌ఫుల్ సీక్వెల్ క్యాన్సిల్..?

Rajkumar Hirani : ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. ఒక్కో సినిమాకు 3 నుంచి 6 ఏళ్ల వరకు గ్యాప్ తీసుకుంటాడు. అలా వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. అంతుకు ముందు ఈయన గురించి చెప్పుకోవాల్సింది.. ఆయన రాసే కథలు. ఆయన ఎంచుకునే కాన్సెప్ట్‌‌లు. ఇంత చెప్పిన తర్వాత ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇంక ఎవరో కాదు… బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరాని.


ఈయన సినిమా చేస్తున్నాడు అంటే… మినిమంలో మినిమం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. కానీ, ఇటీవల ఈయన బ్రాండ్ దెబ్బ తిన్నది. ఇందుకు కారణం షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన డంకీ మూవీ అని చెప్పుకోవచ్చు.

భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. కథ స్లోగా ఉండటంతో పాటు, ఆ సమయంలో వచ్చిన సలార్ మూవీ దెబ్బ కూడా డంకీ పై గట్టి ప్రభావం చూపించింది. దీంతో డంకీ మూవీ కుప్పకూలింది. రాజ్ కుమార్ హిరానీ కెరీర్ లో ఫస్ట్ టైం యావరేజ్ మూవీ అంటూ రిజెల్ట్ వచ్చింది.


డంకీ ఎఫెక్ట్‌‌తో మూవీ రద్దు..?

ఈ మూవీ తర్వాత రాజ్ కుమార్ హిరానీ చేయాల్సిన సినిమాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ జాగ్రత్తల వల్ల ఓ మూవీనే రద్దు అయిపోయినట్టు తెలుస్తుంది.

రాజ్ కుమార్ హిరాని చేసిన అన్ని సినిమాల్లో ఈ మున్నా భాయ్ సిరీస్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశాడు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా కూడా వస్తుంది అంటూ గతంలో తెగ ప్రచారం సాగింది.

ప్రచారం మాత్రమే కాదు.. రాజ్ కుమార్ హిరానీ ఈ మూవీ స్క్రిప్ట్ ను కూడా ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయాడట. అయతే… ఇప్పుడు అతనిపై డంకీ ఎఫెక్ట్ ఉంది. అందువల్లే మున్నా భాయ్ మూడో సినిమాను రాజ్ కుమార్ హిరానీ పక్కన పెట్టేశాడట. దీంతో ఈ సక్సెస్ ఫుల్ మూవీకి సీక్వెల్ రావడం ఇక కష్టమే అని అంటున్నారు. అంతే కాదు… అది ఇక రద్దు అయినట్టే అనే టాక్ కూడా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

మున్నా భాయ్ స్క్రిప్ట్ ను పక్కన పెట్టేసి… అమీర్ ఖాన్ కోసం మరో కథను రెడీ చేస్తున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. అమీర్ ఖాన్ – రాజ్ కుమార్ హిరానీ కాంబోలో ఇప్పటికే త్రి ఇడియట్స్, పీకే సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ హిట్స్. ఇప్పుడు ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు సినీ క్రిటిక్స్.

కాగా, రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో విక్కీ కౌశల్, విక్రాంత్ మాసే కీ రోల్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయనున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×