Nizamabad Crime: పచ్చని కాపురాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. అనేక కుటుంబాలల్లో గొడవలకు, విడాకులకు, ఘోరమైన నేరాలకు దారితీస్తున్నాయి. కొందరు వ్యక్తులు క్షణికమైన ఆనందం కోసం పక్కదారులు పడుతుండగా.. వాటి వల్ల దీర్ఘకాలంలో విషాదాలకు కారణమవుతున్నారు.
భర్తతో కడదాక తోడుంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసినా.. కొందరు భార్యల ఆలోచనలు గతి తప్పుతున్నాయి. ఆస్తి కోసం కొందరు, వివాహేతర సంబంధాలతో మరికొందరు.. కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. మానవత్వం మంటగలుపుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో కట్టుకున్న భర్తను.. ప్రియునితో కలిసి హత్య చేసిందో భార్య. ప్రమాదంగా చిత్రీకరించి అంత్యక్రియను పూర్తి చేసింది.. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హత్య ఉదంతం ఆలస్యంగా బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ తండాకు చెందిన.. గుగులోత్ శంకర్- యమున భార్య భర్తలు. శంకర్ మొదటి భార్య మృతి చెందడంతో.. 40 ఏళ్ల క్రితం యమునను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ దాంపత్యం కొంత కాలం సాఫీగానే సాగింది. 8 ఏళ్ళ క్రితం యమునకు అదే తండాకు చెందిన సమీప బంధువు బావ వరుసయ్యే నందుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
నందుతో యమున చనువుగా ఉండటాన్ని గుర్తించిన భర్త.. అక్రమ సంబంధం పై నిలదీశాడు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, శంకర్ అడ్డు తొలగించుకుంటే హాయిగా బతకొచ్చని భావించారు. ఈ మేరకు.. ప్రియునితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేశారు. ఈనెల 6న కొడుకు, కూతురు ఇంట్లో లేని సమయాన్ని అవకాశంగా తీసుకున్నారు.
ఎప్పటి లాగే రాత్రి డాబాపై పడుకోగా.. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచాయి. ఇదే అవకాశంగా మలుచుకున్న యమున డాబా పై నుంచి మెట్లు దిగేందుకు వెళ్లిన భర్తను ఒక్కసారిగా కిందకు తోసేసింది. తీవ్రంగా గాయపడ్డ భర్తను కర్రలతో కొట్టింది. ప్రియునితో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత సహజ మరణంగా చిత్రీకరించారు.
డాబా పై నుంచి పడి శంకర్ మృతి చెందినట్లు అందరిని నమ్మించింది. హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించింది. ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు శంకర్‌ది సహజ మరణం కాదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: ఇలా ఉన్నారేంట్రా బాబు.. భార్య అందంగా ఉందని చంపిన భర్త
కట్టుకున్న భర్తను హత్య చేసి.. సహజ మరణంగా చిత్రీకరించినా.. పోలీసులు మిస్టరీని చేధించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది..