BigTV English

Varun Tej : గ్రాండ్‌గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ .. మ్యారేజ్ ఎప్పుడంటే ..?

Varun Tej : గ్రాండ్‌గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ .. మ్యారేజ్ ఎప్పుడంటే ..?


Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. మెగా, అల్లు కుటుంబాలు హాజరయ్యాయి. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్ , లావణ్య కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులు హాజరయ్యారు.

సంప్రదాయ వస్త్రధారణలో లావణ్య త్రిపాఠి మెరిసిపోయింది. వరుణ్ కూడా స్టైలిష్ గా ముస్తాబయ్యాడు. ఇక ఎంగేజ్ మెంట్ వేడుకకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాకు రిలీజ్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. నెటిజెన్స్ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో హ్యాష్ వరుణ్ లవ్ అని ట్రెండ్ అవుతోంది.


మొన్నటివరకు రీల్ కపుల్ గా వెండితెరపై అలరించిన ఈ జంట ఇక నుంచి రియల్ కపుల్ గా మారనున్నారు. ఎంగేజ్ మెంట్ జరగడంతో వివాహం ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది చివరిలో పెళ్లి బాజాలు మోగుతాయని తెలుస్తోంది. 2017లో విడుదలైన మిస్టర్‌ మూవీలో నటించిన ఈ ఇద్దరు మొదట ఫ్రెండ్స్ గా మారారు. ఆ తర్వాత అంతరిక్షం మూవీలో నటించిన తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో మూడుముళ్ల బంధంతో ఒక్కటికాబోతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×