Kedar.. ప్రముఖ నిర్మాత , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రాణ స్నేహితుడు కేదార్ (Kedar ) దుబాయిలో గత నాలుగు రోజుల క్రితం మరణించారు. అయితే ఇంత చిన్న వయసులోనే మరణించడంతో ఆయన మరణానికి గల కారణాలు ఏంటి? అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. సాధారణంగా దుబాయ్ పోలీసులు.. ఎవరైనా చనిపోతే 24 గంటల్లోపే ఆ డెడ్ బాడీకి పోస్టుమార్టం చేసి.. సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేస్తారు. కానీ ఇప్పుడు రీ పోస్ట్ మార్టం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే కేదార్ మరణం వెనుక మిస్టరీ తేలేకపోవడంతోనే ఇలా రీ పోస్ట్ మార్టం చేయాలని అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోస్ట్ మార్టంలోనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి అని, కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా.. మరి కొంతమంది గుండెపోటుతోనే మరణించి ఉంటారు అంటూ తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కేదార్ మృతి.. కంగారులో మాజీ ఎమ్మెల్యేలు..
అయితే ఇదిలా ఉండగా కేదార్ వద్ద పలువురు మాజీ ఎమ్మెల్యేలు రూ.100 కోట్ల వరకు డబ్బు ఉంచినట్లు సమాచారం. ఆయన సడన్ గా చనిపోవడంతో ఆ డబ్బును ఎలా రాబట్టుకోవాలో తెలియక కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కేదార్ దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ తో సాన్నిహిత్యం కారణంగానే పలువురు సెలబ్రిటీలు కూడా కేదార్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్లు కూడా సమాచారం.ఇప్పుడు వారంతా కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కేదార్ మృతి ఎంతోమంది సినీ సెలబ్రిటీలకి, రాజకీయ నాయకులకు టెన్షన్ పుట్టిస్తోందని నెటిజెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
అసలేం జరిగింది..?
ఇదిలా ఉండగా ఇటీవల దుబాయ్ లో సినీ ఫైనాన్షియర్ కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఆ వెడ్డింగ్ లో తన స్నేహితులతో కలిసి కేదార్ కూడా హాజరయ్యారు. అనంతరం తన ఫ్లాట్ కి వెళ్లి నిద్రపోయారు. కానీ ఆయన ఫ్లాట్లో విగతజీవిగా పడి ఉన్నారట. దీంతో కేదార్ మరణానికి అనారోగ్యమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ప్రముఖ రాజకీయ నాయకుడు ఇచ్చిన కొకైన్ పార్టీకి కేదార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కాగా, పోలీసులు రైడ్ చేశారు. అప్పుడు సినీ సెలబ్రిటీలతో పాటు కేదార్ పై కూడా పలు కేసులు నమోదయ్యాయి. దీంట్లో కేదార్ ను A4 నిందితుడిగా కూడా చేర్చారు పోలీసులు. అదీకాక వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఇక సినీ నిర్మాతగా మారకముందు 888 అనే పబ్ నిర్వహణలో భాగస్వామిగా కూడా ఉన్నారు. ఇక నిర్మాతగా అడుగుపెట్టిన ఈయన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తమ్ముడైన ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) తో ‘గంగం గణేశా’ అనే సినిమా నిర్మించారు . ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఒక సినిమా నిర్మించాల్సి ఉండగా అనూహ్యంగా ఆయన మరణించారు.