AFG VS AUS: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో… ఇవాళ లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో… కీలక మ్యాచ్ జరిగింది. ఆఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Afghanistan vs Australia ) మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో… ఆఫ్గన్స్ మరోసారి రెచ్చిపోయి ఆడారు. కంగారులు అన్న భయం లేకుండా.. దూసుకు వెళ్లారు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు. ఈ నేపథ్యం లోనే నిర్ణీత 50 ఓవర్లలో…273 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అటల్, ఇబ్రహీం, ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహిదీ, అజ్మతుల్లా ఓమర్జై అద్భుతంగా రాణించడంతో… 273 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది ఆఫ్గనిస్తాన్. చివరి బంతి వరకు… ఆడిన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు… కంగారుల ముందు భారీ టార్గెట్ పెట్టారు. ఈ మ్యాచ్లో నిర్ణీత 50 ఓవర్లలో 274 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది. ఒకవేళ ఆ లక్ష్యాన్ని చేదించకపోతే.. ఆస్ట్రేలియా సెమిస్ రేసు నుంచి వైదొలిగే ఛాన్స్ ఉంటుంది.
Also Read: Rohit Sharma: ఒక్క రూమ్ తో.. 2.6 లక్షల సంపాదిస్తున్న రోహిత్.. అద్దెకు ఇచ్చి మరి?
ఇంగ్లాండ్ జట్టు పైన గెలిచినట్లు.. కంగారులపై గెలిచి నేరుగా సెమీస్ వెళ్లాలని.. ఈ మ్యాచ్లో కసిగా ఆడారు ఆఫ్గానిస్థాన్ ప్లేయర్లు. అయితే ఆఫ్గనిస్తాన్ ప్లేయర్ల దూకుడుకు కంగారులు కూడా… కళ్లెం వేసినట్లే తెలుస్తోంది. లేకపోతే నిర్ణయిత 50 ఓవర్లలో 300కు పైగా పరుగులు చేసే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు. ఒకానొక దశలో… 200 కూడా దాటేలా కనిపించలేదు ఆఫ్ఘనిస్తాన్ టీం. కానీ మొదటి వికెట్ కు వచ్చిన అటల్… సెంచరీ చేసినంత పని చేశాడు.
ఈ మ్యాచ్లో 95 బంతుల్లో ఏకంగా 85 పరుగులు చేసి దుమ్ము లేపాడు అటల్. గత మ్యాచ్లో ఇబ్రహీం.. సెంచరీ చేసి దుమ్ము లేపగా ఈసారి అటల్ వంతు వచ్చింది. అటల్ సెంచరీ చేయకపోయినా… ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఇక అటు కంగారుల బౌలర్లలో… కొత్తగా వచ్చిన జాన్సన్… రెండు కీలక వికెట్లు తీశాడు. దాంతో ఆఫ్గనిస్తాన్ కాస్త డల్ అయింది. అలాగే స్పిన్నర్ అడం జంపా 6 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీయడం జరిగింది.
Also Read: PAK on Cricket Stadiums: 1280 కోట్లు బొక్క… రెండు మ్యాచ్ లకే పాకిస్తాన్ ఎలిమినేట్ ?
ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… సెమీ ఫైనల్ కి వెళ్లాలంటే కచ్చితంగా ఇవాల్టి మ్యాచ్ చాలా కీలకం. ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ ఫైట్ జరిగింది. ఇందులో గెలిచిన జట్టు మాత్రమే సెమీఫైనల్ కు వెళుతుంది. అందుకే రెండు జట్లు చాలా కసిగా ఆడుతున్నాయి. ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా వదలడం లేదు. ఇప్పటికే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో…. గ్రూప్ A నుంచి టీమిండియా అలాగే న్యూజిలాండ్ టీం లు సెమీ ఫైనల్ కు వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. గ్రూప్ బి లో మాత్రం… సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అలాగే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇవాల్టి మ్యాచ్లో ఫలితం తేలితే ఏదో ఒక జట్టు… సెమీ ఫైనల్ కు వెళ్తుంది.