BigTV English

Vijay Thalapathy: ది గోట్ మూవీ ట్రైలర్ రిలీజ్‌ డేట్‌పై అదిరిపోయే అప్డేట్

Vijay Thalapathy: ది గోట్ మూవీ ట్రైలర్ రిలీజ్‌ డేట్‌పై అదిరిపోయే అప్డేట్

Exciting Update on The Goat Movie Trailer Release Date: తమిళ నటుడు దళపతి విజయ్, నటి మీనాక్షి చౌదరి కాంబోలో ఆడియెన్స్‌ ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ మూవీని ఏజీఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై కల్పతి ఎన్ అఘోరం నిర్మాణంలో వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో సహాయ నటీనటులుగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా, స్నేహా, జయరాం యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఆడియెన్స్‌లో భారీ హైప్‌ని కల్పిస్తున్నాయి.


అంతేకాకుండా ఈ మూవీ వచ్చే నెల 5న థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్‌ ది గోట్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ట్రైలర్ ఆగష్ట్ 17న సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతున్నట్టు మూవీ మేకర్స్‌ సోషల్‌మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా స్టైలిష్ డ్రెస్ ఉన్న విజయ్ గన్‌తో షూట్ చేస్తూ కోపంగా ఉన్న స్టి్ల్‌ని మేకర్స్ షేర్ చేశారు. ఇందులో విజయ్ డబుల్ రోల్‌ చేయబోతున్నట్లు వివరాలను వెల్లడించారు.ఇక విజయ్ విషయానికొస్తే.. 2023 ఏడాదిలో లియో మూవీతో అదరగొట్టాడు. అంతకుముందు వారిస్, మాస్టర్, గిల్లీ, మెర్సల్ వంటి మూవీలతో ఆడియెన్స్‌ని అలరించాడు.

Also Read: రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ మూవీస్ జోష్‌కి బ్రేక్ పడనుందా..!


ఇప్పటివరకు 68 చిత్రాల్లో యాక్ట్ చేసి ఆడియెన్స్‌ని అలరించాడు. ఇక గతంలో తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్‌, ఒక కాస్మోపొలిటిన్ పురస్కారాన్ని అందుకున్నాడు. దళపతి 69వ చిత్రం ముగిసిన తరువాత తాను విరామం తీసుకోనున్నట్లు గతంలోనే ప్రకటించాడు. దీంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ మూవీపై దర్శకుడు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. అంతేకాదు తన మూవీపై సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్ లాస్ట్ మూవీని తాను డైరెక్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు రివీల్ చేశాడు. అందరూ అనుకున్నట్టుగా ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాదంటూ, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ అంటూ చెప్పుకొచ్చాడు.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×