BigTV English

Family Star Release Date: దేవర బదులు దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ ఎప్పుడంటే..

Family Star Release Date: దేవర బదులు దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ ఎప్పుడంటే..

Update on Family Star Movie Release Date: విజయ్ దేవరకొండ.. 2011లోనే నువ్విలా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చినా.. హీరోగా గుర్తింపు తెచ్చుకున్నది మాత్రం పెళ్లిచూపులు సినిమాతోనే. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో.. హ్యాండ్సమ్ హీరోగా పేరొందాడు. మహానటి, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. గతేడాది లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన ఖుషి సినిమా కూడా ఫర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మృణాల్ తో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు.


గీతగోవిందం వంటి మంచి హిట్ ను విజయ్ కు అందించాడు పరశురామ్. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో మెలొడీ సినిమా తెరకెక్కుతుండటంతో.. అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో విజయ్ – మృణాల్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులకు తెగనచ్చేసింది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది ఏప్రిల్ 5న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

నిజానికి ఫ్యామిలీ స్టార్.. సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఏప్రిల్ 5న విడుదల చేయాలని భావించగా.. అదేరోజు జూనియర్ ఎన్టీఆర్ దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది టీమ్. దేవర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తో దేవరకొండ కాస్త వెనక్కితగ్గాడు. తాజాగా దేవర రిలీజ్ వాయిదా పడటంతో.. ఫ్యామిలీ స్టార్ ను ముందుగా అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. దేవర విడుదల తేదీపై ఆ చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యమవుతుండటంతో.. ఏప్రిల్ లో రిలీజ్ చేయడంలేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కావడంతో.. దేవర ఏప్రిల్ లో లేనట్లేనని వార్తలొస్తున్నాయి.


Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×