BigTV English

Rowdy Janardhan: రౌడీ హీరో కోసం రంగంలోకి దిగిన ఫేమస్ కెమెరా మెన్.. ఎవరంటే..?

Rowdy Janardhan: రౌడీ హీరో కోసం రంగంలోకి దిగిన ఫేమస్ కెమెరా మెన్.. ఎవరంటే..?

Rowdy Janardhan:రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయనకంటూ ఒక హిట్ పడి, ఆయన ఇమేజ్ ను పెంచిన చిత్రాలు ఏవైనా ఉన్నాయంటే కేవలం ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ అని చెప్పాలి. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవి ఆయన ఖాతాలో పడలేదు. ఇక అప్పటి నుంచి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారే కానీ యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో ఏకంగా పాన్ ఇండియా సినిమా అంటూ ‘లైగర్’ విడుదల చేశారు. ఎన్నో అంచనాలు పెంచారు. కానీ ఈ సినిమా పూర్తిగా బొక్క బోర్ల పడిందని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన ‘ఖుషి’ సినిమా పరవాలేదు అనిపించుకున్నా.. దీని తర్వాత విడుదల చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.


రౌడీ జనార్థన్ కోసం రంగంలోకి మలయాళ సినిమాటోగ్రాఫర్..

ఇక ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి (Gautam Thinnanuri) దర్శకత్వంలో ‘కింగ్ డం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తూ ఉండగా.. సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేయగా ఈ సినిమాకి ఎన్టీఆర్ (NTR) ఇచ్చిన వాయిస్ ఓవర్ ప్లస్ గా నిలిచింది. ఇక మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ప్రముఖ డైరెక్టర్ రవి కిరణ్ కోలా (Ravi Kiran kola) దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ అనే టైటిల్తో సినిమా చేయబోతున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంకా ఇప్పటికే ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్గా నటిస్తున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ప్రేమమ్, భీష్మపర్వం చిత్రాలతో భారీ గుర్తింపు..

అసలు విషయంలోకి వెళ్తే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీర్తి సురేష్ భాగమైన తర్వాత మలయాళ కెమెరామెన్ ను రంగంలోకి దింపుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో స్టార్ కెమెరామెన్ గా పేరు సొంతం చేసుకున్న ఆనంద్ సి చంద్రన్ (Anend C Chandran) ఈ సినిమాకి కెమెరామెన్ గా పనిచేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.. ఇక ఆనంద్ సి చంద్రన్ విషయానికి వస్తే.. ఈయన ప్రేమమ్, భీష్మ పర్వం, బౌగెన్విల్లా వంటి చిత్రాలకి కెమెరామెన్ గా పనిచేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన కెమెరామన్ గా పని చేసిన చిత్రాల విషయానికొస్తే.. ఆనందం, హెలెన్, పూక్కాలం, క్రిస్టీ, నేరం, గోల్డ్, అవియాల్ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే.. 2017 జూన్ 7న తన ప్రేయసి స్వాతి ప్రతాప్ (Swathi Pratap)తో ఏడడుగులు వేశారు. “మా ఇద్దరి మధ్య ఏర్పడిన స్కూల్ పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా 9 ఏళ్ల ప్రేమ తర్వాత ఇప్పుడు మేము ఒక్కటి అయ్యాము.. మమ్మల్ని ఆశీర్వదించండి” అంటూ స్పెషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు ఆనంద్.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×