E-Paper
Advertisement

Konda Surekha: ఏందక్కా.. గిట్ల జేశినవ్? చిక్కుల్లో మంత్రి కొండా సురేఖ!

Konda Surekha: ఏందక్కా.. గిట్ల జేశినవ్? చిక్కుల్లో మంత్రి కొండా సురేఖ!
Advertisement

Konda Surekha: తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో.. లేక ఆ సమయానికి అలా అనేస్తున్నారో తెలియట్లేదు గానీ.. మంత్రి కొండా సురేఖ వ్యవహారం మాత్రం విమర్శలకు దారితీస్తోందనే చర్చ.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అప్పట్లో ఆవిడ చేసిన వ్యాఖ్యలు.. స్టేట్ పాలిటిక్స్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర దుమారం రేపాయ్. ఇప్పుడు తానే ఓ మంత్రి అయి ఉండి.. మరో మంత్రితో తన బంధువు కోసం ఉద్యోగ పైరవీ చేయడం చర్చనీయాంశమైంది. పైగా.. ఆ పైరవీ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వంలోనూ పెద్ద చర్చకే దారితీసిందట.

ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో సురేఖ సంభాషణ

Advertisement

కొండా సురేఖ.. మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడే వీడియో వైరల్ అవుతోంది. సెక్రటేరియట్‌లో దేవాదాయశాఖ మంత్రి కొండాసురేఖ పేషీలో సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన యాప్, వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు. దానికి సంబంధించిన ప్రెస్‌మీట్ ముగిశాక.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో ఆవిడ జరిపిన సంభాషణ.. హాట్ టాపిక్‌గా మారింది.

మంత్రి సురేఖ మాట్లాడిన అంశంపై వివాదం

Advertisement

మంత్రి మాట్లాడిన అంశంపైనే ఇప్పుడు వివాదమంతా. తన బంధువు బిడ్డ కోసం.. ఓ ఉద్యోగం ఉంటే చూడాలంటూ.. కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయ్. ఈ పైరవీ సీన్ అంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహచర మంత్రి.. ఉద్యోగం చూడాలని కోరడం, సరే చేద్దాం.. ఇప్పిస్తానంటూ ఆ మంత్రి కూడా బదులివ్వడంపై.. సోషల్ మీడియాలో డిబేట్‌ మొదలైంది.

ఏదైనా ఉద్యోగం కోసం సిఫారసు చేయాలన్న సురేఖ

తన అన్నయ్య మనవడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడని.. ఏదైనా ఉద్యోగం కోసం సిఫారసు చేయాలని కొండా సురేఖ.. తన సహచర మంత్రి శ్రీధర్ బాబుని కోరారు. ఆయన కూడా సరే అంటూ హామీ ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయాయ్. ఇదంతా క్యాజువల్‌గా జరిగి ఉంటే ఎలాంటి వివాదం లేదు. ఇష్యూ ఇద్దరు మంత్రుల మధ్యలోనే ఉండిపోయేది. బయటకు తెలియకపోయేది. కానీ.. ఈ సీన్ అంతా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డ్ అవడం, ఆ క్లిప్ బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. వివాదంగా మారింది.

విమర్శలు గుప్పి్స్తున్న సోషల్ మీడియా యూజర్లు

ప్రెస్‌మీట్ అవగానే.. మంత్రులు మాట్లాడుకున్నారు. అక్కడ కెమెరాలున్నాయనే కనీస అవగాహన కూడా లేకుండా.. మంత్రి తన బంధువులకు ఉద్యోగం కావాలి.. అందుకు మీ రికమండేషన్ కావాలని అడగడంపై.. సోషల్ మీడియా యూజర్లంతా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. తమకు కూడా ఉద్యోగాలు కావాలని, మంత్రులు సిఫారసు చేయాలని కామెంట్స్ చేస్తున్నారట. ఈ వ్యవహారం కాస్తా.. కాంగ్రెస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తీవ్ర చర్చకు దారితీసిందట.

అప్పట్లో టాలీవుడ్‌లో దూమారం రేపిన సురేఖ వ్యాఖ్యలు

ఆ మధ్య.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే తీవ్ర దుమారం రేపాయ్. ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని.. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులంతా ముక్తకంఠంతో ఖండించిన పరిస్థితి. ఈ క్రమంలో.. కొండా సురేఖ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం, వివరణ అడగడం కూడా జరిగింది. అప్పుడే.. ఆవిడను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వినిపించాయ్. చివరకు.. కొండా సురేఖ తన వ్యాఖ్యల్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటన చేశారు. ఇంకా.. ఈ వ్యవహారం కోర్టులో నలుగుతూనే ఉంది.

సురేఖ వివాదాస్పదంగా మారడం కొత్తేమీ కాదనే చర్చ

ఈ ఇష్యూ.. కొండా సురేఖకు తలనొప్పిగా మారిందనేది విశ్లేషకుల మాట. అయితే.. ఇదే సమయంలో మంత్రిగారి వ్యవహారం వివాదాస్పదంగా మారడం ఇప్పుడు కొత్తేమీ కాదనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. గతంలో ఆవిడ మాట్లాడిన ఆడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. మనవడి పుట్టినరోజు సందర్భంగా.. ఎవరెక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు తాగినంత మద్యం అంటూ చెప్పిన సెల్ఫీ వీడియో కాల్ కూడా వైరల్ అయింది. మొత్తంగా.. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడినా.. అది వైరల్ అవడం పరిపాటిగా మారుతోందనే చర్చ పార్టీలో నడుస్తోందట.

Also Read: రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్.. 5 లక్షల మందికి ఉద్యోగాలు..

మంత్రి కొండా సురేఖ గ్రాఫ్ పడిపోతోందనే చర్చ

అంతేకాదు.. ఆమె వ్యవహారశైలి పదే పదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుండటంతో.. కొండా సురేఖ గ్రాఫ్ కూడా పడిపోతోందనే చర్చ సాగుతోంది. ఆవిడ పనితీరు కూడా బాగాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయట. ఇప్పటికే.. పలుమార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన మంత్రి కొండా సురేఖ.. ఇకపై కొంత సంయమనంతో వ్యవహరిస్తే బాగుటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×