BigTV English

Sukumar : రాజమౌళికి దెబ్బ మీద దెబ్బ కొట్టిన సుక్కు.. మహేష్ మూవీ డౌటే..

Sukumar : రాజమౌళికి దెబ్బ మీద దెబ్బ కొట్టిన సుక్కు.. మహేష్ మూవీ డౌటే..

Sukumar : సుకుమార్ అంటే కూల్ అనుకుంటివా.. కాదు ఫైర్ అని నిరూపించేసాడు.. గతంలో సుక్కు తీసిన సినిమాలు అన్ని కూడా చాలా కూల్ గా ఫ్యామిలి ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. పుష్ప సినిమాతో తన లోని మరో కోణాన్ని బయట పెట్టేసాడు. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో రికార్డులు బ్రేక్ చేసింది. భారీ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటుగా బ్రేక్ మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఆ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ వచ్చింది. వారం రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. గతంలో రాజమౌళి తీసిన సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.. రాజమౌళి భయాన్ని నిజం చేసాడు సుక్కు.. అంటే ఇప్పుడు జక్కన్న పేరు కన్నా సుక్కు పేరే ఎక్కువగా వినిపిస్తుంది..


గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ సుకుమార్ ఎక్కువగా క్లాస్ కంటెంట్ మీద వెళ్తున్నాడని నిజంగా ఆయన కనుక మాస్ సీరియస్ గా తీసుకుంటే తాము వెనుకబడి పోతామని చెప్పడం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఒక్కో సినిమాకు వెరియేషన్స్ చూపించాడు. దాంతో తర్వాత సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రంగస్థలంతో రూటు మార్చడమే కాదు కమర్షియల్ పల్స్ మీద తన పట్టుని చూపించాడు.. పుష్ప సినిమా కంప్లీట్ మాస్ అని నిరూపించాడు. మొత్తానికి సుక్కులో చాలా వెరియేషన్స్ ఉన్నాయని ప్రూవ్ చేసుకున్నాడు. పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుందో మనం చూసాము ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఆ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 వచ్చేసింది.

ఈ పుష్ప2 1000 కోట్ల గ్రాస్ సాధించడం చూశాక అప్పుడు రాజమౌళి వ్యక్తం చేసిన భయాన్ని ఇవ్వాళ సుకుమార్ నిజం చేసి చూపించారు . ఫాంటసీ టచ్, జానపదం, మల్టీస్టారర్, భారీ టెక్నికల్ హంగులు ఏమీ లేకుండా ఒక ఎర్రచందనం దొంగ కథతో పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టడం మామూలు విషయం కాదు . బడ్జెట్ పరంగా వందల కోట్లు ఖర్చు అయి ఉండొచ్చు కానీ దానికి అంతకంతా వెనక్కు వచ్చేలా నార్త్‌ నుంచి సౌత్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట పుష్ప 2 అని వినిపిస్తుంది.. సంక్రాంతి వరకు చెప్పుకోతగ్గా సినిమాలు లేవు దాంతో పుష్ప 2 కలెక్షన్స్ రెండు వేల కోట్లు రావడం పక్కా అని ఇండస్ట్రీలో టాక్..


ఈ ఒక్క రికార్డుతో రాజమౌళి రికార్డులను బ్రేక్ చేసిందనే చెప్పాలి.. ఇప్పుడు రాజమౌళి కన్నా గ్రేట్ అని సుకుమార్ ఒక్క సినిమాతో నిరూపించుకున్నాడు. అయితే ఇది ఇక్కడితో ఆగదు .. పుష్ప క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ కు వెళ్లిపోయింది .. బాహుబలి త్రిబుల్ ఆర్ ప్రభాస్ , చరణ్ , ఎన్టీఆర్ తో పాటు జక్కన్న బ్రాండ్ బలంగా సినిమాపై రిజిస్టర్ అయింది .. కానీ సుకుమార్ కు ఇంకా అది రాలేదు .. సో ఇప్పుడు రామ్ చరణ్ తో చేసే తర్వాత సినిమాలో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాలి .. నెక్స్ట్ ప్రాజెక్టు రామ్ చరణ్ చెయ్యనున్నాడని తెలిసిందే.. పుష్ప 2 రికార్డును క్రాష్ చేసేలా స్టోరీ ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్.. ఇక హీరోలు సుకుమార్ తో సినిమాలు చెయ్యాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మహేష్ ను ఆయన ఫ్యాన్స్ సుకుమార్ తో సినిమా చెయ్యమని కోరుతున్నారు.. రాజమౌళి తో సినిమా డౌట్ అని ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఎస్ఎస్ఎంబీ 29 ఇప్పటిలో స్టార్ట్ అవుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×