BigTV English

Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివారు.. అందుకే అసెంబ్లీకి రావాలి.. మంత్రి పొంగులేటి

Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివారు.. అందుకే అసెంబ్లీకి రావాలి.. మంత్రి పొంగులేటి

కేసీఆర్ రావాలి!


⦿ ఈనెల 31 లోపు మంత్రివర్గ విస్తరణ
⦿ అసలైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడమే లక్ష్యం
⦿ సంక్రాంతి లోపు వీఆర్వో వ్యవస్థ
⦿ తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు
⦿ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అనుకుంటున్నాం
⦿ ఆయనలా మేమెవరూ 80వేల పుస్తకాలు చదవలేదు
⦿ కేటీఆర్, హరీష్ 5వేల పుస్తకాలు చదివినా వాళ్ళ సూచనలు తీసుకునేవాళ్ళం
⦿ మీడియాతో మంత్రి పొంగులేటి చిట్‌చాట్

హైదరాబాద్, స్వేచ్ఛ: Ponguleti Srinivasa Reddy: అధికారం కోల్పోయిన నాటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది రెండు సార్లే. ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికైతే, రెండోసారి బడ్జెట్ సమయంలో పాల్గొన్నారు. ఇంత సీనియారిటీ ఉన్న లీడర్ అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అయినా కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం లేదు. సోమవారం జరిగిన సమావేశానికి కూడా హాజరు కాలేదు. అయితే, 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు రెగ్యులర్‌గా జరుగబోతున్నాయి.


ఈసారైనా కేసీఆర్ వస్తారా లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, తాను వస్తారనే అనుకుంటున్నానని అన్నారు. ఈ సమావేశాల్లో ఆర్వోఆర్ చట్టాన్ని తెస్తున్నామని, కేసీఆర్ సూచనలు చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘‘80వేల పుస్తకాలు నేను, మా ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ చదవలేదు. వాటిని చదివిన అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా. కేటీఆర్, హరీష్ రావు కనీసం 5వేల పుస్తకాలు చదివినా వాళ్ళ సూచనలు తీసుకునే వాళ్ళం. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో సూచనలు చేశారా? గోల మాత్రం చేస్తున్నారు.

పదేండ్లలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా అధికారిక ప్రకటన చేశారా’’ అని అడిగారు. రైతులకు బేడీలు వేసిన సంఘటనపై స్పందిస్తూ, ఇప్పటికే తమ ముఖ్యమంత్రి స్పందించారని చెప్పారు పొంగులేటి. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్‌కి కారణమని అన్నారు.

అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహంపై సమాధానం లేకనే అసెంబ్లీకి రాకుండా పారి పోయారని విమర్శించారు. అదానీ విషయంలో వివాదం వద్దనే స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లు వెనక్కి పంపామన్నారు. ఈనెల 31 లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, 40శాతం డైట్ కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో 14వ తేదీన మంత్రులు, అధికారులు సహఫంక్తి భోజనాలు చేస్తున్నట్టు చెప్పారు.

పదేండ్లలో బీఆర్ఎస్ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజాపాలనలో అర్హులైన వారందరూ ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలు చేర్చామని, సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసివేశామని తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షల 32 వేల దరఖాస్తులను యాప్‌లో నమోదు చేశామని, ఆలస్యం అయినా అసలైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.

Also Read: Chess Champion : ప్రపంచ చెస్ ఛాంపియన్ గా భారత కుర్రాడు.. అతిపిన్న వయస్సులో అరుదైన రికార్డ్

ఐటీడీఏ, ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని, ప్రత్యేక నిధులు కేటాయింపు ఉంటుందని తెలిపారు. సంక్రాంతి లోపు వీఆర్వో వ్యవస్థను తీసుకొని వస్తామని స్పష్టం చేశారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారిని, వెనక్కి వచ్చే వాళ్ళను తీసుకుంటామని తెలిపారు పొంగులేటి. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×