E-Paper
Advertisement

Horoscope  Today December 13th : ఆ రాశి వారికి ఈరోజు  ధన వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి.  

Horoscope  Today December 13th : ఆ రాశి వారికి ఈరోజు  ధన వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి.  
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 13న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్య పరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మిధున రాశి: ఈ రాశి వారికి ఇవాళ బంధు మిత్రులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో పార్టీ సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితి వంట నిరుత్సాహపరుస్తుంది. ఇంటాబయటా చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి.

సింహ రాశి:  ఈ రాశి వారికి ఇవాళ దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధు మిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

కన్యారాశి: ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి.  వివాహాది శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

తులారాశి: ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో  వివాదాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. రుణ ఒత్తిడి అధికమవుతుంది. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.  ఉదోగ్యస్థులకు అధికారులతో చర్చలు ఫలించవు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి.  వృత్తి, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

మీనరాశి: ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×