BigTV English

Prasanth Varma : రానా చెప్పిన, రెండు వారాల్లో రాబోయే PVCU అప్డేట్ ఇదేనా..? హనుమా… ఇది నిజం కాకుండా చూడు..

Prasanth Varma : రానా చెప్పిన, రెండు వారాల్లో రాబోయే PVCU అప్డేట్ ఇదేనా..? హనుమా… ఇది నిజం కాకుండా చూడు..

Prasanth Varma : ‘హనుమాన్ ‘ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాకు ముందు హిట్ సినిమాలు చేసినా కూడా ఈ సినిమా తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఈయనతో సినిమాలు చేసేందుకు యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరు ఆయనతో సినిమాలు తియ్యాలని చూస్తున్నారు.. ఇక ఈయన ఎంత డిమాండ్ చేసేందుకు ఇచ్చేందుకు ప్రొడ్యూసర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ మధ్య ప్రశాంత్ వర్మ ఒక్క సినిమాకూడా పూర్తి చెయ్యలేదు కానీ వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా మరో లేడి ఒరియేంటెడ్ సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక నెట్టింట చక్కర్లు కొడుతుంది.


ప్రశాంత్ వర్మ లేడి ఒరియేంటెడ్ సినిమా.. 

హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకొనే పనిలో ఉన్నాడు. హనుమాన్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్‌వర్మ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా మారిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ‘జై హనుమాన్‌’తో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ‌తో కూడా ఒక సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ.. అలాగే మరో లేడి ఓరిఎంటెండెడ్ మూవీని చేస్తున్న అని ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.. హనుమాన్ కన్నా ముందే ఆ మూవీని మొదలు పెట్టాడట.. కానీ హనుమాన్ సూపర్ హిట్ అవ్వడంతో అతను ఇప్పుడు వేరే సినిమాల పై ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది.


ఇదిలా ఉండగా.. ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి మూడో చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రాబోతుండ‌గా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వచ్చింది. పీవీసీయూ3 అంటూ వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ లేడి ఓరియెంటెడ్‌గా రాబోతున్న‌ట్లు ఇందులో కాళి మాతాగా ప్ర‌ముఖ హీరోయిన్ ఇండియ‌న్‌ సూప‌ర్ వుమెన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే ఈ మూవీలో చిన్న హీరోయిన్ ను తీసుకోవడం పై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. హనుమాన్ సినిమాతో హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో జ్ఞానేశ్వరి కాండ్రేగుల సినిమా చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది..

ఇక జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఈ అమ్మడు చాలా మందికి తెలియకపోవచ్చు.. టీవీ షో పెళ్లి చూపులులో పాల్గొని విన్నర్ అయ్యింది ఈ భామ. ఈ తెలుగమ్మాయి ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది. జ్ఞానేశ్వరి కాండ్రేగుల పుట్టింది విశాఖపట్టణం లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది ఈ భామ.. దూత సినిమాతో కాస్త పాపులర్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని చిన్నవే.. అలాంటి హీరోయిన్ ను తీసుకోవడం పై ప్రశాంత్ వర్మ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. పెద్ద పాపులర్ అవ్వని హీరోయిన్ ను తీసుకోవడం ఎందుకు అంత రిస్క్ చెయ్యడం అవసమా అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×