Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ 8లో ఫ్యామిలీ వీక్ మొదలవ్వడంతో ప్రతీ కంటెస్టెంట్ ఇంటి నుండి ఎవరో ఒకరు తమను చూడడానికి వస్తున్నారు. కానీ ఇప్పటివరకు ప్రసారమయిన ఎపిసోడ్‌లో మాత్రం చాలావరకు కంటెస్టెంట్స్ మధర్సే తమను చూడడానికి వచ్చారు. కానీ మొదటిసారి అవినాష్ భార్య బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. దానికి సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలయ్యింది. అందరూ పడుకున్న తర్వాత హౌస్‌లోకి ఎంటర్ అయిన అవినాష్ భార్య అను.. తన భర్తతో కలిసి అందరినీ ఎంటర్‌టైన్ చేసింది. ఇక అవినాష్, అనులకు బిగ్ బాస్ ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీనిని జీవితాంతం మర్చిపోలేనని అవినాష్ ఎమోషనల్ అయ్యాడు.
సడెన్ సర్‌ప్రైజ్
కంటెస్టెంట్స్ అంతా పడుకున్న తర్వాత కన్ఫెషన్ రూమ్ నుండి సైలెంట్‌గా అను వచ్చి.. అవినాష్ పక్కన పడుకొని తనను హగ్ చేసుకుంది. ఎవరా అని లేచి చూసేసరికి అక్కడ తన భార్య ఉంది. అను గట్టిగా నవ్వడంతో అక్కడే ఉన్న టేస్టీ తేజ, రోహిణి కూడా లేచారు. వారికి ముందుగా హాయ్ చెప్పింది అను. ‘‘సడెన్‌గా వచ్చి ఎవరో హగ్ చేసుకున్నారేంటి అనుకున్నాను’’ అని అవినాష్ అనగా.. ఎవరు అనుకున్నావు అంటూ తనను లాక్ చేశాడు టేస్టీ తేజ. ఇదంతా వింటూ ఉన్న రోహిణి.. ‘‘బ్లాక్ డ్రెస్ చూసి యష్మీ అనుకొని ఉంటాడు’’ అని సైలెంట్‌గా కౌంటర్ వేయడంతో అందరూ నవ్వుకున్నారు.
Also Read: యష్మి పై హైప్.. ఆడియన్స్ నాడీ పట్టుకున్న ఫాదర్..!
లైట్స్ ఆఫ్
అవినాష్, అను కలిసి గేమ్ గురించి మాట్లాడుకున్నారు. తన గేమ్ అంతా ఓకేనా అని అవినాష్ అడగగా.. ‘‘పాతవాళ్లతోనే ఎంగేజ్ అయితే ఇంకా కొంచెం బాగుంటుంది’’ అని సలహా ఇచ్చింది. ‘‘యష్మీతో ఎంగేజ్ అవుతూనే ఉన్నా’’ అనగానే ఇద్దరు కలిసి సరదాగా నవ్వుకున్నారు. ‘‘అవినాష్.. లైట్స్ ఆఫ్ చేయమని అడిగారు కదా. అనును తీసుకొని యాక్షన్ రూమ్‌కు రండి’’ అన్నాడు బిగ్ బాస్. దీంతో సంతోషంలో బిగ్ బాస్‌కు థాంక్యూ చెప్తూ తన భార్యను యాక్షన్ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. ‘‘నైట్ లైట్స్ ఉంటాయి చూసుకో’’ అంటూ రోహిణి వారికి వార్నింగ్ ఇచ్చింది. యాక్షన్ రూమ్‌లోకి వెళ్లి చూడగానే ఈ కపుల్ కోసం స్పెషల్‌గా డిన్నర్ ఏర్పాటు చేసి ఉంది.
బెస్ట్ ఎక్స్‌పీరియన్స్
‘‘ఇది ఇప్పటివరకు నా జీవితంలోనే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ బిగ్ బాస్’’ అంటూ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు అవినాష్. ఆ తర్వాత తన భార్యకు ఐ లవ్ యూ చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇద్దరు కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేశారు. నిజంగానే లైట్స్ ఆఫ్ చేయడంతో సిగ్గుగా ఉందంటూ అవినాష్ తెగ సిగ్గుపడిపోయాడు. యాక్షన్ రూమ్ నుండి ఇద్దరూ చెమటలు తుడుచుకుంటూ రావడంతో అవినాష్ భార్య కూడా యాక్ట్ చేసేస్తుందంటూ నవ్వింది రోహిణి. అయితే తనకు నిజంగానే చెమటలు పడుతున్నాయని చెప్పింది. ‘‘లోపల ఏం లేదు డొల్ల’’ అంటూ కౌంటర్ ఇచ్చింది రోహిణి.