BigTV English

Rashmika Mandanna: రష్మిక పాలిట శాపంగా మారిన స్టార్ హీరో.. చెప్తే విన్నావా..అనుభవించు..!

Rashmika Mandanna: రష్మిక పాలిట శాపంగా మారిన స్టార్ హీరో.. చెప్తే విన్నావా..అనుభవించు..!

Rashmika Mandanna:రష్మిక మందన్న (Rashmika Mandanna).. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు గత రెండు సంవత్సరాలుగా వరుస సూపర్ హిట్ సక్సెస్ లు అందుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ముఖ్యంగా ఒక సినిమా తర్వాత మరొక సినిమా.. కేవలం రెండు సంవత్సరాల లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మూడు చిత్రాలతో ఏకంగా రూ.3500కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎంతోమంది స్టార్ హీరోయిన్లు సమంత(Samantha), నయనతార(Nayanthara), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai), దీపికా పదుకొనే (Deepika Padukone) లాంటి స్టార్ హీరోయిన్లు కూడా సాధించని రికార్డ్స్ క్రియేట్ చేసింది. 28 సంవత్సరాల వయసులోనే ఆ రేంజ్ లో విజయం అంటే నిజంగా ఊహించలేనిదే.


సల్మాన్ ఖాన్ మూవీతో రష్మిక స్పీడ్ కి బ్రేకులు..

ఇక ఈ సినిమాలు ఇచ్చిన విజయంతో.. సికందర్, రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ అంటూ సుమారుగా నాలుగైదు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీంతో రష్మికను ఆపేదెవరు అనే రేంజ్ లో జెడ్ స్పీడ్ లో దూసుకుపోయింది. కానీ ఒక్క సినిమాతో బొక్క బోర్ల పడిందని చెప్పవచ్చు. ఇక అదే సల్మాన్ ఖాన్ (Salman Khan)తో నటించిన ‘సికందర్’. గత కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ సరైన విజయాన్ని అందుకోలేదు. దాంతో రష్మిక గుర్తింపుతో నైనా సల్మాన్ ఖాన్ కి ఫేమ్ వస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా బొక్క బోర్ల పడింది. పైగా యానిమల్, పుష్ప2, ఛావా చిత్రాలతో నిర్మించుకున్న ఫేమ్ దెబ్బకు పడిపోయిందని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే ఈమె పై ఎన్నో విమర్శలు వచ్చాయి. తండ్రి వయసు ఉన్న వ్యక్తితో రొమాన్స్ ఏంటి? ఈ సినిమాలో నటించొద్దు అని అభిమానులు కూడా వేడుకున్నారు. అయినా సరే అభిమానుల మాటలు లెక్కచేయకుండా సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేసి ఇప్పుడు డిజాస్టర్ ను మూటగట్టుకుంది. మొదటి ఆట నుంచి నెగటివ్ టాక్ రావడంతో నెటిజన్స్ సైతం వరుస సినిమాలతో విజయం అందుకున్న నీకు సల్మాన్ ఖాన్ శాపంగా మారాడు.. చెప్తే విన్నావా.. అనుభవించు అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.


ఇక్కడ తప్పించుకుంది..అక్కడ దొరికిపోయిందిగా

మరొకవైపు నితిన్ (Nithin ), వెంకీ కుడుముల (Venky kudumula) కాంబినేషన్లో వచ్చిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో శ్రీ లీల (Sree Leela) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాను రిజెక్ట్ చేసిన ఈమె బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ చేతికి చిక్కిపోయింది. ఇక్కడ రాబిన్ హుడ్ నెగిటివ్ టాక్ తెచ్చుకోగా అక్కడ సికందర్ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. మరి ఈ సినిమా ఫలితాలు పూర్తిగా తెలియాలి అంటే.. ఈరోజు కలెక్షన్లు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే అని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా రష్మిక మూడు సినిమాలతో సూపర్ హిట్ సొంతం చేసుకొని.. ఇప్పుడు సడన్ గా డిజాస్టర్ మూవీలో నటించింది. ఈమె పై ఈ ఫ్లాప్ ప్రభావం పడే అవకాశం ఉందేమో అని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఒక మొత్తానికి అయితే రష్మిక ఈ దెబ్బతో సైలెంట్ అయిపోతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఇకనైనా మిగతా సినిమా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని కూడా అభిమానులు కోరుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×