BigTV English

Gundeninda GudiGantalu Today episode: రోహిణి, శృతిలకు షాకిచ్చిన షీలా.. ప్రభావతిని కొట్టిన శృతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి, శృతిలకు షాకిచ్చిన షీలా.. ప్రభావతిని కొట్టిన శృతి..

Gundeninda GudiGantalu Today episode march 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం పిల్లలు వచ్చారని సుశీల సంతోషంగా ఉంటుంది.. అయితే ఇంట్లోకి వెళ్లగానే శృతి షీలా ప్రేమకు ఫిదా అవుతుంది.. శృతి కూడా రవి వాళ్ళ నానమ్మకు బాగా నచ్చేస్తుంది.. మనోజ్‌కు, రవికి రెండు రూమ్స్ చూపించి అందులోకి వెళ్లమంటుంది ప్రభావతి. చూశావా నాన్నా.. వాళ్లిద్దరు ఆస్తులు ఉన్నోల్లు కాబట్టి బెడ్స్ ఉన్న గదిల్లోకి పంపించింది. నేను డ్రైవర్‌ను, నా భార్య పూలమ్మేది కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నేను ఈ నేలపైనా అయినా పడుకుంటాను. కానీ, నా భార్య సంగతి చూసుకోవాలిగా. ఇబ్బంది పెట్టకూడదుగా అని బాలు అంటాడు.. అది విన్న షీలా వెంటనే మీకు ఏం ఖర్మ రా బాబు.. నా ముద్దుల మనవడిని బయట పడుకొనిస్తానా? నువ్వు నా రూమ్ లో పడుకో అని అంటుంది. మీరు ఉన్నన్ని రోజులు ప్రభావతి ఈ నేలపైనే పడుకోవాలి అని సుశీల ఆర్డర్ వేస్తుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. నీకు నవారు మంచం ఇస్తానురా అని సత్యంతో అంటుంది సుశీల. దాంతో నవ్వేసిన సత్యం.. అది పెద్దరాయుడు తీర్పు. ఇకపై నేలపైనే పడుకోవాలి. మనోజ్, రవికి గదులు ఇచ్చి బాలును మాత్రం పట్టించుకోనందుకు నీకు మా అమ్మ వేస్తున్న శిక్ష ఇది అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రూమ్ లోకి వెళ్లిన మనోజ్ అక్కడ ఎలా ఉండాలో అని ఆలోచిస్తాడు. కానీ రోహిణి మనోజ్ కె కౌంటర్ వేస్తుంది. మన రూమే అగ్గిపెట్టేలా ఉంటుంది. ఇది చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంది. మనింటికి ఎవరైనా వస్తే ఆరు బయట పడుకోవాలి. ఇక్కడ చాలా విశాలంగా ఉంది. ఏదో పారిస్ నుంచి వచ్చినట్లు ఫోజు కొడతావేంటీ అని మనోజ్‌కు రోహిణి చురకలు వేస్తుంది.. అవును మీ మామయ్య మలేషియా నుంచి వస్తున్నాడు కదా ఇక్కడ ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. దానికి రోహిణి ఆలోచనలో పడుతుంది. ఇక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకుండా డౌట్ వస్తుంది. వెంటనే ఫారెన్ నుంచి వచ్చినట్లు బిహేవ్ చేయమని చెప్పాలి అని అనుకుంటుంది రోహిణి. ఇక మనోజ్‌తో మలేషియా మావయ్య ఇక్కడ కంఫర్టుబుల్‌గా ఉంటారో లేదో. మంచి రూమ్ చూసి ఇవ్వాలి. మనం ఉంటున్న గదే ఇచ్చి మనం వేరే చోట ఉందామని రోహిణి అంటుంది.

రోహిణి మావయ్య గురించి బాలు మీనాతో మాట్లాడుతాడు. నాకెందుకు ఆ పార్లరమ్మను చూస్తుంటే తేడా కొడుతుంది. ఎందుకో టెన్షన్ పడుతుంది.. అని బాలు అనగానే మీనా ఊరుకోండి అందరి మీద మీకు అనుమానం వస్తుంది అంటుంది. లేదు ఏదో ఉంది కనిపెడతాను అని బాలు అంటాడు. మీకు అందరి మీద అనుమానమే ఊరుకోండి అని మీనా అంటుంది. అటు శృతి, రవిలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు రవి. ఏసీ గాని ఏమీ లేవు గాలు ఆడటం లేదు అని అనగానే సుశీలమ్మ అక్కడికి వచ్చి నాకోసం అందరూ వచ్చారని సంతోషపడ్డాను ఇప్పుడు మీరందరూ వెళ్లిపోతారని బాధపడుతుంది.


మీనా నేను చెప్తాను బామ్మ గారు మీరు ఏమి కంగారు పడకండి అని అంటుంది. మనం వెళ్ళిపోదాం అన్న అందుకే అమ్మమ్మ ఎంత ఫీలయిందో చూసావా అలాంటి అమ్మమ్మ నువ్వు బాధ పెడతావా అని అంటుంది. దానికి శృతి సరే అమ్మమ్మని నేను అస్సలు బాధ పెట్టను ఉంటాను ఇక్కడే అనేసి అంటుంది. ఇక మీనా ను ప్రభావతి కాఫీ అడుగుతుంది. మీనా కాఫీ తీసుకొని వస్తుంది.

రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నారు కదా వెజ్ నాన్ వెజ్ ఏది కావాలంటే అది చేసి పెట్టాలని మీ నాకు ఆర్డర్ వేస్తుంది. కానీ సుశీలమ్మ మాత్రం కానీ సుశీలమ్మ మాత్రం నేను నీకు అత్తగారిని కదా నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. నువ్వు చెప్పిన లిస్టు మొత్తం నువ్వే ప్రిపేర్ చేయాలి అని షాక్ ఇస్తుంది. నేనొక్కదాన్నే ఎలా చేయాలంటే నీ ముద్దుల కోడలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్లు నీకు సాయం చేస్తారు అని అంటుంది. బాలు ఫుల్లు ఖుషి గా ఉంటాడు. ఇన్నాళ్లకు తిక్క కుదిరిందని సంతోషపడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అందరూ సరదాగా కూర్చొని భోజనం చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×