BigTV English

Allu Arjun: ఎట్టకేలకు రీల్ పుష్పరాజ్ ను కలుసుకున్న రియల్ పుష్పరాజ్.. ఇది కదా స్పెషల్ మూమెంట్ అంటే..!

Allu Arjun: ఎట్టకేలకు రీల్ పుష్పరాజ్ ను కలుసుకున్న రియల్ పుష్పరాజ్.. ఇది కదా స్పెషల్ మూమెంట్ అంటే..!

Allu Arjun..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా, సుకుమార్(Sukumar) దర్శకత్వంలో విడుదలైన చిత్రం పుష్ప(Pushpa). ఈ సినిమా ప్రేక్షకులలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలోని పాటలు, తగ్గేదేలే అనే సిగ్నేచర్ డైలాగ్స్ అన్నీ కూడా విపరీతంగా పాపులర్ అయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత మూడేళ్లు నిర్విరామంగా కష్టపడి, 2024 డిసెంబర్ 5న ‘పుష్ప2’ సినిమా రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ గెటప్ కి అభిమానులు ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. ఆయన ఆటిట్యూడ్ కి, పర్సనాలిటీకి, మేనరిజంకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.


పుష్ప 2 తో భారీ క్రేజ్..

పైగా ఇందులో గంగమ్మ జాతర సీను సినిమాకే హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా విడుదలైన తర్వాత నార్త్ కు సంబంధించిన ఒక బన్నీ అభిమాని అచ్చం పుష్పరాజ్ గెటప్ లో తొలిసారి మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ లో కనిపించి, అక్కడివారిని ఆకట్టుకున్నారు. ఇక తర్వాత పలువురు హీరోయిన్స్ తో ఫోటోలు దిగి షేర్ చేశారు ఈ అభిమాని. అంతేకాదు ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా సరే అక్కడ వాలిపోయాడు. అటు సినిమా ఫంక్షన్స్ మాత్రమే కాదు ఇటు రాజకీయ నాయకులూ కూడా ఈయనను బాగా ఉపయోగించుకున్నార. అలా రియల్ పుష్పరాజుగా భారీగా పేరు సొంతం చేసుకున్నారు.


రీల్ పుష్పరాజ్ ను కలిసిన రియల్ పుష్ప రాజ్..

ఇకపోతే ఈయనను రీల్ పుష్పరాజ్ చూస్తే రియాక్షన్ ఏంటో చూడాలని అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ తరుణం వచ్చేసింది. చేతిలో ఫోటో పట్టుకొని అల్లు అర్జున్ ఇంటి ముందు అభిమానులతో పాటు ఆయన కూడా చాలా ఎదురు చూశారు. ఇక అభిమానులకు హాయ్ చెప్పడానికి వచ్చిన రీల్ పుష్పరాజు ఎట్టకేలకు రియల్ పుష్పరాజును చూసి ప్రత్యేకంగా తన బాడీగార్డ్స్ తో చెప్పి మరీ ఆయనను కలిశారు. ఇక అలా రీల్ పుష్పరాజ్ ను రియల్ పుష్పరాజు కలుసుకొని కాసేపు ముచ్చటించారు. ఈ తరుణం చూడడానికి రెండు కళ్ళు చాలలేదని చెప్పవచ్చు. ఎట్టకేలకు ఇద్దరు ఒకే చోట కనిపించి అటు అభిమానులకు కూడా మంచి అనుభూతిని కలిగించారు. అంతేకాదు ఈ సందర్భం చూసి ఇది కదా అసలైన అద్భుతమైన సందర్భం అంటే, ఈయన కదా రియల్ హీరో అంటే.. ఎక్కడి నుంచో వచ్చిన అభిమానిని గుర్తుపెట్టుకొని మరి అల్లు అర్జున్ పలకరించడం నిజంగా ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అంటూ బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్..

అల్లు అర్జున్ సినిమాలు..

ఇక అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చిన ఈ సినిమా ఆలస్యం అయ్యేటట్టు కనిపిస్తోంది. ఇక ఆయనతో సినిమా చేయడానికి ముందే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో #AA 22 సినిమా ప్రకటించారు అల్లు అర్జున్ తన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్మెంట్ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది

 

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×