Reusing Oil: కొందరు వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ వేడి చేసి వినియోగిస్తారు. బయట స్ట్రీట్ ఫుడ్ తిన్నప్పుడు కూడా దాదాపు ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అయినా దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, వంట నూనెను మళ్లీ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఎంత డేంజర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నూనెను పదేపదే వేడి చేయడం వల్ల కాల్చిన నూనెకు అసహ్యకరమైన వాసన ఇచ్చే విష అక్రోలిన్ పదార్థం తయారవుతుందట. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి హానికరమైన కపౌండ్స్ కూడా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మేళనాలు క్యాన్సర్ కారకాలు ఏర్పడే అవకాశం ఉందట.
ముఖ్యంగా నూనెను ఎక్కువసార్లు వేడిచేసినప్పుడు లేదా తిరిగి ఉపయోగించినప్పుడు ఇలా జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా చాలా సార్లు నూనెను వేడి చేయడం వల్ల రుచి కూడా మారిపోతుంది.
క్యాన్సర్ కారకాలు:
ఎక్కువ సార్లు నూనెను వేడి చేసి వాడడం వల్ల క్యాన్సర్‌కు కారణం అయ్యే యాక్రిలామైడ్ వంటివి తయారయ్యే ఛాన్స్ ఉందట. అంతేకాకుండా వివిధ ఆరోగ్య సమస్యలు తీసుకోచ్చే ఆల్డిహైడ్ వంటి హానికరమైన సమ్మేళనాలు కూడా విడుదల అవుతాయట. వేడి చేసిన నూనె వల్ల వచ్చే విషపూరిత పదార్థాలు శరీరంలో పేరుకుపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు:
ఒకసారి వాడిన నూనెతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపులో మంట, జీర్ణ అసౌకర్యం వంటివి వస్తాయట. క్రమంగా ఇది అధిక కొలెస్ట్రాల్ లేదా అధిక రక్తపోటు వంటి పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఊబకాయం:
మళ్లీ ఉపయోగించిన నూనెలో వండిన ఆహారాన్ని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక మంట ఏర్పడుతుంది. దీని వల్ల ఆర్థరైటిస్, మధుమేహం, ఊబకాయం, అల్జీమర్స్ వ్యాధి కూడా వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు.
చర్మానికీ హాని:
వాడిన నూనెను మళ్లీ వాడడం వల్ల అనారోగ్యకరమైన కొవ్వులు శరీరంలోకి చేరిపోతాయట. ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్‌లు, ఆక్సిడైజ్డ్ కాంపౌండ్‌లు ఉండే రీయూజ్డ్ ఆయిల్‌లో వేయించిన ఆహారాన్ని పదేపదే తీసుకోవడం వల్ల చర్మంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. దీని వల్ల మొటిమలు, ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.