BigTV English

Virat Kohli – Rahul Dravid : వీల్ చైర్ పై ద్రవిడ్… విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి

Virat Kohli – Rahul Dravid : వీల్ చైర్ పై ద్రవిడ్… విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి

Virat Kohli – Rahul Dravid : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏం చేసినా నెట్టింట వైరల్ అయిపోతుంది. అతడి బ్యాటింగ్ దగ్గర నుంచి బిహేవియర్ వరకు ప్రతి దాని గురించి అభిమానులు, సోషల్ మీడియాలో నెటిజన్స్ డిస్కస్ చేస్తుంటారు. తన పెర్ఫార్మెన్స్ ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు కింగ్ కోహ్లీ. వీల్ చైర్ పై వచ్చిన రాహుల్ ద్రవిడ్ వద్దకు విరాట్ కోహ్లీ  వచ్చి హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


మరోవైపు విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నాడు.  బెంగళూరు జట్టు ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దీంతో కోహ్లీ కాస్త నిరాశలో ఉన్నారు. మరోవైపు జర్మన్ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ ప్యూమా నుండి వచ్చిన రూ.300 కోట్ల విలువైన అద్భుతమైన ఆఫర్‌ను ఆయన తిరస్కరించడం క్రికెట్ ప్రేమికులనే కాకుండా వ్యాపార రంగాన్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎనిమిదేళ్లుగా ప్యూమాతో కొనసాగిన భాగస్వామ్యానికి విరామం పలికాడు కోహ్లీ.  తన సొంత బ్రాండ్  ‘వన్8’ను ప్రపంచస్థాయిలో ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2017లో ప్యూమాతో రూ.110 కోట్ల డీల్‌తో బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగిన కోహ్లీ, ఇప్పుడు దాదాపు మూడు రెట్లు ఎక్కువ మొత్తానికి వచ్చిన కొత్త ఒప్పందాన్ని అంగీకరించకపోవడం వెనుక అతని స్వీయ బ్రాండ్ నిర్మాణమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ప్యూమా ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ సహ-స్థాపించిన ‘అజిలిటాస్’ అనే స్పోర్ట్స్‌వేర్ కంపెనీతో కలిసి పనిచేయాలని కోహ్లీ నిర్ణయించాడు. ఇది కూడా వన్8 బ్రాండ్ పరిధిని విస్తరించడంలో కీలకంగా మారనుంది. ప్రపంచ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకుని కోహ్లీ తన బ్రాండ్‌ను లైఫ్‌స్టైల్, అథ్లెటిక్ విభాగాల్లో నిలబెట్టాలని భావిస్తున్నాడు. మరోవైపు కెప్టెన్‌గా రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్‌సీబీ తమ ఆరంభ ఐదు మ్యాచ్‌లలో మూడింటిలో విజయాలు సాధించింది. కోహ్లీ వ్యక్తిగతంగా కూడా మంచి ఫార్మ్‌లో ఉన్నాడు. ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే, కోహ్లీ తన క్రికెట్ కెరీర్‌కు సరితూగేలా వ్యాపార రంగంలోనూ భారీ అడుగులు వేస్తున్నాడని స్పష్టమవుతోంది. స్వీయ బ్రాండ్ అభివృద్ధి, స్పోర్ట్స్ మానేజ్‌మెంట్‌లో సహకారాలు, అంతర్జాతీయ వ్యాపార దృష్టితో అతను కొనసాగుతున్న తీరు యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది.


ఇక రాహుల్ ద్రవిడ్ ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకునే విధానంపై ప్రస్తుతం సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తుంటేనే కోహ్లీ పై పలువురు ప్రశంసలు కురిపించడం విశేషం. మరోవైపు రేపు ఆర్సీబీతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఓపెనర్లు సాల్ట్, విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజస్థాన్ జట్టు కూడా గుజరాత్ తో ఓటమి చెంది ఆర్సీబీతో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. జైపూర్ లో జరిగే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడో వేచి చూడాలి మరీ.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×