Face Packs For Winter: శీతాకాలం ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఈ సీజన్ చర్మం, జుట్టు సమస్మలను పెంచుతుంది. చలి కాలంలో గాలిలో తేమ కారణంగా, చర్మం, జుట్టు పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే చలికాలంలో తరచుగా మార్కెట్‌లో లభించే కోల్డ్‌క్రీమ్‌లను రాసుకుంటారు. అయితే మార్కెట్‌లో లభించే క్రీములలో చాలా రకాల రసాయనాలు ఉంటాయి. ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కలగజేస్తాయి. వీటిని నివారించడానికి, కొన్ని హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. ఈ 4 రకాల ఫేస్ ప్యాక్‌లు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.
వింటర్ సీజన్ కోసం ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లు:
చలికాలంలో ఉండే వాతావరణం వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై పొడిబారడం, దురద వంటి సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో, ఇంట్లో తయారుచేసిన కొన్ని ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్‌లు చర్మం పొడిబారడాన్ని తగ్గించడమే కాకుండా, దురద , చికాకును తొలగిస్తాయి. వింటర్ సీజన్‌లో ఎలాంటి ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనెతో ఫేస్ ప్యాక్:
శీతాకాలంలో తేనెను ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మీరు తేనెను చర్మానికే కాకుండా పెదాలకు కూడా ఉపయోగించవచ్చు. ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా ఒక చెంచా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం, రోజ్ వాటర్ అవసరం మేరకు తీసుకోండి. వీటిని కలిపి ఫేస్ ప్యాక్ లాగా ముఖానికి అప్లై చేసుకోండి. తర్వాత 30 నిమిషాలు ఉంచి వాష్ చేసుకోండి.
కాఫీ ఫేస్ ప్యాక్:
కాఫీ తాగడానికి మాత్రమే కాదు, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, 2 టీస్పూన్ల కాఫీలో 1 టీస్పూన్ తేనె , పాలను అవసరాన్ని బట్టి కలపాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపండి . దీనిని మందపాటి పేస్ట్ లాగా చేయండి. ముఖం మీద 20 నిమిషాలు అప్లై చేసి, ఆపై చల్లటి నీటితో కడగాలి.
పెరుగు ఫేస్ ప్యాక్:
చర్మాన్ని మృదువుగా మార్చేందుకు పెరుగు పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, రెండు చెంచాల పెరుగులో ఒక చెంచా తేనె , చిటికెడు పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచి ఆపై చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ సహాయంతో మీ చర్మం మెరిసిపోతుంది.
Also Read: బట్టతల రాకూడదంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి
శనగపిండి ముఖానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పూర్వం సబ్బులు లేని కాలంలో శనగపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకునేవారు. శనగపిండి ఫేస్ ప్యాక్ చేయడానికి.. 2 చెంచాల శనగపిండిలో 1 చెంచా పచ్చి పాలను కలపండి. చిటికెడు పసుపు కూడా కలపండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి కనీసం 15 నిమిషాల పాటు ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల చలికాలంలో ముఖం మెరిసిపోతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ క్షణాల్లోనే మీ సొంతం అవుతుంది.