BigTV English

Aadhi Pinisetty : సైలెంట్ గా బజ్ క్రియేట్ చేస్తున్న శబ్దం.. హీరో లుక్ అదుర్స్

Aadhi Pinisetty : సైలెంట్ గా బజ్ క్రియేట్ చేస్తున్న శబ్దం.. హీరో లుక్ అదుర్స్

Aadhi Pinisetty : కోలీవుడ్ డైరెక్టర్ అరివళగన్..ఆది పినిశెట్టి కాంబోలో పెరకెక్కిన వైశాలి చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబడ్డమే కాకుండా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. 2009లో తమిళంలో ఈరం పేరు తో విడుదలైన ఈ మూవీ టిక్ టాక్ సంపాదించడమే కాకుండా వసూళ్ల వర్షం కురిపించింది. అప్పట్లో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన థమన్ కంపోస్ట్ చేసిన ట్యూన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. థమన్ కు మంచి పేరు తెచ్చిన సినిమాలలో వైశాలి కూడా ఒకటి అనడంలో ఎటువంటి డౌట్ లేదు.


ఈ చిత్రం వచ్చి ఇప్పటికే 14 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్లీ తిరిగి ఇన్ని సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సూపర్ ట్రయో కాంబినేషన్లో మరొక సరికొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు. మూవీకి సంబంధించి హీరో ఫస్ట్ లుక్ ను ఈరోజు చిత్ర బృందం ఓ పోస్టర్ రూపంలో విడుదల చేశారు.

ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ తో ఉన్న ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని నెటిజెన్స్ మెచ్చుకోవడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీలో సీనియర్ నటి లైలా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఒకప్పుడు తన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన లైలా పెళ్లి చేసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీకి తాత్కాలికంగా దూరం అయింది. మళ్లీ తిరిగి ఇన్ని సంవత్సరాలకు మొన్న కార్తీ సర్దార్ మూవీలో ఓ కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు తిరిగి శబ్దం మూవీలో మరొక కీలక పాత్ర పోషించబోతోంది. ఈ మూవీ లో లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ వచ్చే సంవత్సరం విడుదల చేయడానికి  మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×