BigTV English

Vishwambhara: రాత్రింబవళ్లు కష్టపడుతున్న చిరు.. ఈసారైనా అనుకున్న టైం కి వస్తారా..?

Vishwambhara: రాత్రింబవళ్లు కష్టపడుతున్న చిరు.. ఈసారైనా అనుకున్న టైం కి వస్తారా..?

Vishwambhara:సాధారణంగా ఒక సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అంటే చిత్ర బృందం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ విడుదల తేదీ దగ్గర పడితే మాత్రం రాత్రింబవళ్లు కష్టపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే ఇంతలా కష్టపడినా అనుకున్న సమయానికి వస్తారా? అంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). చివరిగా మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాతో డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందేం అందుకే ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassista Mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’అనే సినిమా చేస్తున్నారు.


రాత్రింబవళ్లు కష్టపడుతున్న చిరంజీవి..

ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. ఆ సమయంలో చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతూ.. కొంత భాగం షూటింగ్ ను నిలిపివేశారు. ఈ క్రమంలోనే అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయలేకపోయారు.. ఇక తర్వాత మే నెలలో సమ్మర్ స్పెషల్ గా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అది కూడా జరిగేటట్టు కనిపించలేదు. దీనికి తోడు జూన్ 24వ తేదీని ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదే రోజున గతంలో ‘ఇంద్ర’ సినిమాను రిలీజ్ చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు ఆ డేట్ కోసం పక్కా ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నారు.


నైట్ షూటింగ్ నుంచి ఫోటో లీక్..

ఈసారి కూడా తన సెంటిమెంట్ ను వర్క్ అవుట్ అయ్యేలా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న చిరంజీవి.. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు రాత్రింబవళ్లు కూడా షూటింగ్లో బిజీగా గడిపేస్తూ కష్టపడుతున్నారు. ఇకపోతే నిన్న రాత్రి కూడా షూటింగ్లో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి ఇలా రాత్రుళ్ళు కూడా సినిమా కోసం కష్టపడుతుండడంతో కనీసం ఈసారైనా అనుకున్న సమయానికి వస్తారా? అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంత వేగంగా షూటింగ్ జరుగుతోంది కాబట్టి.. జూన్ 24వ తేదీని విడుదల చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఆరోజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారా..? లేక అంతకంటే ముందే ఆడియన్స్ ముందుకు వస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

విశ్వంభరలో స్టార్ కాస్ట్..

ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో.. చిరంజీవి, త్రిష (Trisha ) జంటగా రాబోతున్న చిత్రం విశ్వంభర. యూవీ క్రియేషన్స్ పతాకం పై వి.వంశీకృష్ణారెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దర్శకులుగా ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాదు చిరంజీవి , కీరవాణి కలయికలో రాబోతున్న నాలుగవ చిత్రం ఇది. ఇక ఇందులో సురభి, హర్షవర్ధన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ , రాకెట్ రాఘవ తో పాటు దిగ్గజా స్టార్ నటుడు సుమన్ (Suman)కూడా నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.నిజానికి ఈ విషయం ఎక్కడ వెలువడలేదు కానీ నిన్న జరిగిన షూటింగ్ నుంచి సుమన్ కి సంబంధించిన ఫోటో బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గతంలో సుమన్ , చిరంజీవి వంటి విభేదాలున్నట్లు వార్తలు వినిపించినా.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తుండడంతో అనుమానాలకు కాస్త చెక్ పడుతోంది అని చెప్పవచ్చు.మరి ఇంత పగడ్బందీగా, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×