Vijayasai Reddy Political Entry: రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని, వైసీపీకి రిజైన్ చేసి పొలిటికల్ రిటైర్‌మెంట్ ప్రకటించిన విజయసాయిరెడ్డి వాయిస్ మారిపోయింది. తాను రాజకీయాల్లో కొనసాగాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే పోలిటికల్ రీఎంట్రీకి సాయిరెడ్డి ఫిక్స్ అయిపోయారా? ఇప్పటికే ఆయన ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో బీజేపీ బాట పడతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన్ని తిరిగి రాజ్యసభకు పంపి వైసీపీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తేచ్చుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. సాయిరెడ్డి తాజా వ్యాఖ్యలతో ఆ ఊహాగానాలు నిజమవుతాయా? ఇప్పటికిప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టకపోయినా.. ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమైనట్లేనా?
వైసీపీలో మెుదటి నుంచి నెంబర్-2గా వ్యవహరించిన సాయిరెడ్డి
వైసిపి ప్రారంభం నుండి పార్టీలో నెంబర్ టూ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా కొంత కాలం కీలకంగా వ్యవహరించారు.. విశాఖ సహా ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలు మూట గట్టుకున్నారు.. ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఏ పని కావాలన్నా, సీఎం జగన్ ను ఎమ్మెల్యేలు కలవాలన్న, నియోజవర్గ సమస్యలను జగన్ తో చెప్పాలన్నా కూడా విజయసాయిరెడ్డి అనుమతి ఉండాల్సిందే అన్నట్లు నడిచింది వ్యవహారం…
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాయిరెడ్డికి తగ్గిన ప్రాధాన్యత
వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే విజయసాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఆయన్ని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సాయిరెడ్డి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2గా ఫోకస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఓటమి తర్వాత ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడని విజయసాయి అటు రాజ్యసభ సభ్యత్వానికి, ఇటు వైసీపీకి రాజీనామా చేసి పొలిటికల్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. తాజాగా లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరవుతున్న విజయాసాయి డైరెక్ట్‌గా జగన్ సన్నిహితుడు రాజా కసిరెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తూ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో వైసీపీలో తన నెంబరు టూ పాత్రపై విచిత్రంగా స్పందించారు
జగన్ కోటరీని, సజ్జలను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు
వ్యవసాయం చేసుకుంటానంటూ వైసీపీకి గుడ్‌బై చెప్పి బయటకు వచ్చిన సాయిరెడ్డి జగన్ కోటరీని, సజ్జలను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. పాత కేసులు తవ్వితీస్తారన్న భయంతోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారంటారు. అదలాఉంటే పొలిటికల్‌గా సైలెంట్ అవుతారనుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సడన్‌గా వాయిస్ మారుస్తున్నారు. తాను పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలని ప్రశ్నిస్తుండటం చర్చల్లో నలుగుతోందిప్పుడు
బీజేపీ నుంచి విజయసాయిరెడ్డికి హామీ లభించిందా?
ఇప్పుడు ఏపీలో విజయసాయి రిజైన్ చేసిన రాజ్యసభ స్థానం ఉపఎన్నికకి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 22న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మే 9న ఆ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఆ స్థానం ఎలాగూ కూటమి పార్టీలకే దక్కనుండటంతో.. రాజ్యసభలో ఏ పార్టీ నుంచి ఎవరు అడుగుపెడతారో అన్న చర్చ మొదలైంది. ఆ రాజ్యసభ సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకే దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.. విజయసాయిరెడ్డి ఢిల్లీ బీజేపీ పెద్దల ఆదేశాల మేరకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారంట.. ఆ టైమ్‌లో తిరిగి ఆయన్ని రాజ్యసభకు పంపిస్తామన్న హామీ కూడా బీజేపీ పెద్దలు ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది
3 నెలల క్రితమే కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం
ఆ క్రమంలో ఇటీవల కాలంలో ఆయన మళ్లీ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరతారని, మళ్లీ రాజ్యసభకు ఎన్నికవుతారని ప్రచారం సాగుతోంది. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ కోటాలో రాజ్యసభకు వెళతారని ప్రచారం సాగుతోంది. అయితే దానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు. వాస్తవానికి మూడు నెలల క్రితమే విజయసాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో చంద్రబాబు అంగీకరించకపోవడంతో అది వాయిదా పడిందంట. అయితే ఈ సారి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.
Also Read: ట్రంప్ దెబ్బకు వెనక్కి తగ్గిన డ్రాగన్.. ఇండియానే దిక్కా!
ఒక వేళ కాషాయ పెద్దలు విజయసాయిరెడ్డిని చేర్చుకోవాలని ఫిక్స్ అయి, రాజ్యసభకు పంపాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తే మాత్రం ఆయన ఒప్పుకోక తప్పదంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయకు అది తప్ప వేరే మార్గమేమీ లేదంటున్నారు. ఏదేమైనా ఈ సారి విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంట్రీకి బ్రేకులు పడినా.. ఆయన బీజేపీలో చేరడం, బీజేపీ పెద్దలు ఆయన్ని తర్వాతైనా రాజ్యసభకు పంపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే సాయిరెడ్డి ఇప్పుడు పొలిటికల్ రీ ఎంట్రీ ప్రస్తావన తెస్తున్నారంటున్నారు.