BigTV English

Vishwambharam Update: విశ్వంభర నుండి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ఆరోజే..!

Vishwambharam Update: విశ్వంభర నుండి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ఆరోజే..!

Vishwambharam Update:ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి (Vassista Mallidi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర(Vishwambhara). భారీ అంచనాల మధ్య మే నెలలో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ‘ఇంద్ర’ సినిమా రిలీజ్ చేసిన రోజు.. అంటే జూన్ 24వ తేదీన సెంటిమెంట్ గా ఈ విశ్వంభర సినిమాను రిలీజ్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే గత కొన్ని గంటల క్రితం ఈ సినిమా నుండి ఒక బిగ్ అప్డేట్ రాబోతోంది అంటూ యూ.వీ. క్రియేషన్స్ బ్యానర్ వారు ఒక పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు అప్డేట్ రానే వచ్చింది. ఇక అదేంటంటే ఈ సినిమా నుండి ‘రమా రామ’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయడానికి డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 12వ తేదీన విశ్వంభర సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేస్తామంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఆ పోస్టర్లో వెనుక శ్రీరాముడి విగ్రహం.. దానికి ముందు చిరంజీవి బాల హనుమంతులతో కలిసి ఉన్న పోస్టర్ను రివీల్ చేశారు ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి అయితే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎదురుచూసిన అభిమానులు..మళ్లీ రెండు రోజులు ఎదురు చూడాల్సిందే అని తెలిసి కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఏదైనా బిగ్ అప్డేట్ వదులుతారని ఎదురు చూసిన అభిమానులకు ఇది పెద్ద నిరాశ అని చెప్పవచ్చు.


విశ్వంభర మూవీ విశేషాలు..

యు వి క్రియేషన్స్ పతాకం పై వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం .ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉండగా.. అటు చిరంజీవి , కీరవాణి కాంబోలో వస్తున్న నాలుగవ చిత్రం ఇది. ఇక ఇందులో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హీరోయిన్గా నటిస్తోంది. ఇక వీరితోపాటు సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య జూన్ నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా అటు చిరంజీవికి ఎటువంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


Hollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘గేమ్ ఆఫ్ డెత్’ నటుడు మృతి..!

వీఎఫ్ఎక్స్ కోసం మళ్లీ కష్టపడుతున్న టీమ్..

ఇకపోతే విశ్వంభర నుంచి గత కొన్ని నెలలుగా ఎటువంటి అప్డేట్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు విశ్వంభర నుండీ షాట్ విడుదల చేయగా.. వీటి ద్వారా నెగిటివిటీ మూటగట్టుకోవడంతో మళ్ళీ చిత్ర బృందం మొత్తం ప్యాచ్ వర్క్ లో బిజీగా పడిపోయింది. వీ ఎఫ్ ఎక్స్ పనులను మళ్లీ కొత్తగా స్టార్ట్ చేశారని కూడా అంటున్నారు. అయితే ఈసారి కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ను రంగంలోకి దింపి ఈయన పర్యవేక్షణలోనే వశిష్ట గ్రాఫిక్స్ వీఎఫ్ఎక్స్ పనులపై మళ్ళీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే సినిమా ఆలస్యం అవుతుందని సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×