Hollywood: సినీ ఇండస్ట్రీలో పలు విషాదాలు సినీ పరిశ్రమను మరింత విషాదంలోకి నెట్టి వేస్తున్నాయని చెప్పవచ్చు. ఒకప్పుడు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న పలువురు సెలబ్రిటీలు కొన్ని కొన్ని సమస్యల వల్ల తుది శ్వాస విడుస్తున్నారు. కొంతమంది వృద్ధాప్య సమస్యలతో మరణిస్తే.. మరికొంతమంది వ్యక్తిగత కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా హాలీవుడ్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న మెల్ నోవాక్ (Mel Novak) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుత ఈయన వయసు 93 సంవత్సరాలు నటించారు. ఐ ఫర్ యాన్ ఐ , బ్లాక్ బెల్ట్ జోన్స్ వంటి యాక్షన్ సినిమాలలో నటించారు 1974లో ట్రక్ టర్నర్ లో నటించిన ఈయన చివరిగా 2020లో ఎబోలా రెక్స్ వర్సెస్ మర్డర్ హార్మెంట్స్ సినిమాలో కనిపించారు. ఇక అంతే కాదు గేమ్ ఆఫ్ డెత్ సినిమాలో బ్రూస్ లీ తో కలిసి విధంగా కనిపించారు. అలా గొప్ప నటుడుగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడవడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఈయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
మెల్ నోవాక్ సినిమాలు..
1934 జూన్ 16న జన్మించిన ఒక అమెరికన్ నటుడు.. ఈయన ఎక్కువగా విలన్ పాత్రలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఈయన సొంతంగా స్టంట్స్ చేయడమే కాకుండా యాక్షన్ సన్నివేషాలలో కూడా డూప్ లేకుండా కనిపించి, యాక్షన్ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ముఖ్యంగా తన నటనతో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈయన.. అటు సినిమాలే కాకుండా ఇటు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించి ఆకట్టుకున్నారు.
వ్యక్తిగత జీవితం..
ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఈయన ఒక్క నియుక్త మంత్రి కూడా. చెక్ కానర్స్ కుమారుడు జఫ్ఫ్రీ అలాన్ కానర్స్, టిమ్ బర్టన్ తండ్రి, బిల్ బర్టన్ వంటి ప్రముఖుల అంత్యక్రియలు స్మారక చిహ్నాలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందారు. 39 సంవత్సరాలకు పైగా ఈయన జైలు మంత్రిత్వ శాఖలో పనిచేశారు. ఈయనకి ఇద్దరు కుమార్తెలు.. అలాగే ఆ కుమార్తెల ద్వారా ముగ్గురు మనవరాళ్లు కూడా ఉన్నారు.
Peddi Shooting Update: రామ్ చరణ్ మాస్ యాక్షన్ ఎపిసోడ్… 4 రోజులుగా అక్కడే షూటింగ్..!