BigTV English

G2: పాన్ ఇండియా లెవ‌ల్లో అడివి శేష్ కొత్త ప్రాజెక్ట్‌

G2: పాన్ ఇండియా లెవ‌ల్లో అడివి శేష్ కొత్త ప్రాజెక్ట్‌

G2:పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగి అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న టాలీవుడ్ హీరోల్లో అడివి శేష్ ఒక‌రు. మేజ‌ర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఆయ‌న హిట్ 2తో రీసెంట్‌గా మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాను హిందీలోనూ విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో శేష్ మ‌రో పాన్ ఇండియా ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. శేష్‌కు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో గూఢ‌చారి ఒక‌టి. ఈ సినిమాకు సీక్వెల్‌గా గూఢ‌చారి 2 ఉంటుంద‌ని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే త‌ర్వాత ఉన్న క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా.. ఈ సీక్వెల్‌కు స‌మ‌యం ప‌ట్టింది.


తాజాగా శేష్.. పాన్ ఇండియా లెవ‌ల్లో గూఢ‌చారి 2ను అనౌన్స్ చేశారు. అయితే సీక్వెల్‌కు డైరెక్ట‌ర్ మారారు. గూఢ‌చారి సినిమాను శ‌శి కిర‌ణ్ తిక్క తెర‌కెక్కించారు. సీక్వెల్‌ను కూడా ఆయ‌న డైరెక్ట్ చేస్తార‌నే అందరూ భావించారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు డైరెక్ట‌ర్ మారారు.G2 పేరుతో తెర‌కెక్క‌నున్న‌ గూఢ‌చారి 2 చిత్రానికి విన‌య్ కుమార్ సిరిగినీడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. జ‌న‌వ‌రి 9న G2 సినిమాకు సంబంధించిన ప్రీ విజ‌న్ వీడియోను ఢిల్లీ, ముంబైలో విడుద‌ల చేయ‌బోతున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×