BigTV English

Game Changer : చెర్రీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఐఫా అవార్డుల వేదికపై గేమ్ ఛేంజర్ సాంగ్ రిలీజ్

Game Changer : చెర్రీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఐఫా అవార్డుల వేదికపై గేమ్ ఛేంజర్ సాంగ్ రిలీజ్

Game Changer : గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ గురించి చాలా కాలంగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఈ సినిమాలోని రెండో పాట రిలీజ్ పై అప్డేట్ రాగా, తాజా సమాచారం ప్రకారం ఈ రెండో పాటను ప్రతిష్టాత్మకమైన ఐఫా అవార్డుల వేదికపై రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.


ఐఫా వేదికపై గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్

తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ రోజు రోజుకూ ఈ మూవీ ఆలస్యం అవుతుండడంతో మెగా అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అప్పుడెప్పుడో ‘జరగండి’ అనే సాంగ్ ను ఊరించి ఊరించి రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క అప్డేట్ కూడా లేదు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘రా మచ్చా మచ్చా’ అనే పాటను సెలబ్రేట్ చేసుకోవడానికి టైం వచ్చింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇంకా రిలీజ్ డేట్ కు సంబంధించిన డేట్ ను చిత్ర బృందం కన్ఫర్మ్ చేయకపోవడం మెగా అభిమానులను మరోసారి అప్సెట్ చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాటను సోమవారం అంటే సెప్టెంబర్ 30న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతుందని తెలుస్తోంది. అంతకంటే ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఫా 2024 అవార్డుల వేదికపై ‘రా మచ్చా’ సాంగ్ ను ప్రివ్యూ ద్వారా రిలీజ్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ పురస్కారాల వేడుక (IIFA) అబుదాబి లోని యస్ ఐలాండ్లో సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు జరగబోతోంది. ఈ వేడుకకు సౌత్, నార్త్ నుంచి దిగ్గజ నటినటులు హాజరు కాబోతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ గౌరవం అందుకున్నందుకు స్పెషల్ గా సత్కరించనున్నారు. ఈ వేడుకకు చెర్రీ కూడా హాజరవుతాడని కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.


RaaMachaMacha | Game Changer | Ram Charan | Kiara Advani | Shankar | Thaman  S

రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన తమన్

కాగా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పటి దాకా మెగా అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మూవీని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రెండో పాటతో అయినా మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇస్తారని ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్. కానీ ఈ మూవీకి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డిసెంబర్ 20 న మూవీ రిలీజ్ కాబోతోందని, ఇప్పటినుంచి మూవీ ప్రమోషన్స్ షురూ అంటూ స్పెషల్ ట్వీట్ చేసి చెర్రీ ఫ్యాన్స్ కు తీపి కబురు అందించారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా, శ్రీకాంత్, ఎస్జె సూర్య, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×