OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తున్న మలయాళం సినిమాలు, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు చిన్న ఇండస్ట్రీగా ఉన్న మలయాళం ఇండస్ట్రీ, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లెవెల్ లో సినిమాలు చేస్తోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ట్విస్టులతో అదరగొడుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఇందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon Prime Video) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎలా వీజా పూంచిర‘ (Ela Veezha Poonchira). ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి షాహి కబీర్ దర్శకత్వం వహించారు. ఇందులో సౌబిన్ షాహిర్, సుధీ కొప్పా, జూడ్ ఆంథనీ జోసెఫ్ నటించారు. కధాస్ అన్‌టోల్డ్ బ్యానర్‌పై, విష్ణు వేణు నిర్మించిన ఈ మూవీకి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. డాల్బీ విజన్ 4K HDRలో విడుదలైన మొట్టమొదటి మలయాళ చిత్రం ‘ఎలా వీజా పూంచిర’. ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక మారుమూల కొండ ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. అందులో ఇద్దరు మాత్రమే డ్యూటీ చేస్తూ ఉంటారు. అక్కడికి డ్యూటీ చేయడానికి హీరో వెళ్తాడు. హీరో వచ్చాక అక్కడ్నుంచి మరొక పోలీస్ డ్యూటి టైమ్ అయిపోవడంతో వెళ్ళిపోతూ, నాన్ వెజ్ తినాలనుకుంటే ఫ్రిడ్జ్ లో ఉందంటూ చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న ఒక వెజిటేరియన్ కి మాంసం వండటం నచ్చదు. అందుకే ఆ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ టైం అయిపోతుండటంతో నాన్ వెజ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చిన హీరో ఆ ప్రాంతాన్ని బాగా పరిశీలిస్తాడు. ఆ ప్రాంతంలో ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి. అక్కడికి వచ్చే టూరిస్టులను కాపాడటమే ఈ పోలీసుల లక్ష్యం. సిగ్నల్స్ కూడా సరిగ్గా అందని ఆ ప్రాంతంలో హీరో డ్యూటీ చేస్తాడు. అయితే ఆ ప్రాంతంలో ఒక అబ్బాయి పిడుగు పడి చనిపోతాడు. అందుకు హీరో అతన్ని కాపాడలేకపోయానని చాలా బాధపడతాడు.
మరోవైపు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి బాడీని ముక్కలు చేసి చంపి ఉంటారు. కొండ క్రింది ప్రాంతంలో జరగడంతో ఆ కేసును అక్కడున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ క్రమంలోనే కొండ కింద ఉన్న పోలీసులు పైకి వస్తారు. అప్పటికే అందులో పనిచేసే ఒక పోలీస్ మీద అనుమానం వచ్చిన హీరో, అతని కాళ్లు చేతులు కట్టేసి ఒకచోట దాచిపెడతాడు. అక్కడికి వచ్చిన పోలీసులకు, తనతో పాటు ఉన్న వ్యక్తి స్నానానికి వెళ్ళాడని అబద్ధం చెప్తాడు. చివరికి ఆ పోలీసులు అక్కడినుంచి బయలుదేరుతారు. ఆ ప్రాంతంలో జరిగిన హత్యను ఎవరు చేశారు? తనతో పాటు ఉన్న పోలీస్ ఆఫీసర్ ని హీరో ఎందుకు బంధిస్తాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ఎలా వీజా పూంచిర’ (Ela Veezha Poonchira) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.