Game Changer Day 1 Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్.. ఈ మూవీ భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా నిన్న థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌ను తెచ్చుకుంది గేమ్ ఛేంజర్. గురువారం అర్ధరాత్రి నుంచి ఏపీ సహా ఓవర్సీస్ లో స్పెషల్ షోలు పడ్డాయి. జనవరి 9 న రాత్రి నుంచే థియేటర్ల కు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ తొలి రోజు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు.. మరి ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత చేసిన ఈ మూవీ మెగా ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. అయితే ఓపెనింగ్స్ మాత్రం మాములుగా లేవు. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రూ.25 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. తమిళనాడు , కర్ణాటక, హిందీ మార్కెట్ కలిపి రూ.30 కోట్లు.. ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు కలిపి మొత్తంగా రూ. 70 కోట్ల వరకు వసూల్ వస్తాయని అనుకున్నారు మేకర్స్.. ఇక వరల్డ్ వైడ్ 220 కోట్ల టార్గెట్ తో మూవీ థియేటర్లలోకి వచ్చింది. కానీ మొదటి రోజు కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స చూస్తే.. ఈ మూవీ థియేటర్లలో కి వచ్చాక మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. 220 కోట్ల టార్గెట్ తో వచ్చిన మూవీ కేవలం 51.2 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 42 కోట్లు, హింధిలో 7 కోట్లు, తమిళ్ లో కేవలం 2 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తుంది. కన్నడ, మలయాళం కూడా అంతంత మాత్రనే కలెక్షన్స్ వచ్చాయి. మరి వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారాల్లో భారీగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పంతుళ్లు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగ కూడా మూవీకి కలిసి వచ్చేలా ఉంది. సంక్రాంతికి మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీలతో పోటీ పడుతుందేమో చూడాలి.. ఆ సినిమాల పోటీని తట్టుకొని నిలబడుతుందా అనేది ఆసక్తిగా మారింది.
ఈ మూవీని 500 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టి నిర్మించారు. మరి ఆ మందం కలెక్ట్ చేస్తుందేమో చూడాలి.. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.. ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి నటించారు. శ్రీకాంత్, సునీల్, సముద్రాఖని, ఎస్ జే సూర్య వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు.