Bus hit Lorry: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారుని తప్పించబోయిన ట్రావెల్ బస్సు.. నేరుగా లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, 30 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి ఓ ట్రావెల్ బస్సు టూర్ ప్లాన్ చేసింది. హైదరాబాద్ టు అరుణాచలం వెళ్తోంది బస్సు. రాత్రి హైదరాబాద్ నుంచి బయలు దేరిన బస్సు కర్నూలు వైపు వెళ్తోంది. జడ్చర్ల NH- 44 నేషనల్ హైవేలో కారు టైర్ పేలిపోయింది. దాన్ని తప్పించబోయిన క్రమంలో లారీ డ్రైవర్ బ్రేక్ వేశాడు. వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రావెల్ వేగంగా లారీని ఢీకొట్టాడు.
ఈ ఘటనలో బస్సు ముందు పార్టు నుజ్జునుజ్జు అయ్యింది. అప్పటికి చాలామంది ప్యాసింజర్లు నిద్రలోకి జారుకుంటున్నారు. పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలుసుకునే సరికి ఓ ప్యాసింజర్, బస్సు క్లీనర్ చనిపోయారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 30 మంది వరకు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న ఓ వైపు అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. బాధితులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు అక్కడికి చేరుకుని జామైన ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో గమనించని బస్సు డ్రైవర్ వేగంగా ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. మృతులు, బాధితుల గురించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
ALSO READ: సూర్యాపేటలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు – నలుగురు దుర్మరణం
పండగ వేళ విషాదం..
జడ్చర్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
కారు తప్పించబోయి లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తుండగా ఘటన
ప్రమాదంలో ఓ ప్యాసింజర్ తో పాటు క్లీనర్ మృతి
30 మంది ప్రయాణికులకు గాయాలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… pic.twitter.com/FIzNSFtPtn
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2025