Brahmamudi serial today Episode: అక్కడ కొండ మీద కోతులు కూడా తెప్పించాలని చూస్తున్నారు.. అసలు సీమంతం అంటే ఇలా కూడా చేయాలా అంటాడు రాజ్. ఏవండి ఆవిడ ఇప్పుడు సీమంతం డ్రామా ఎందుకు మొదలుపెట్టిందో నాకు తెలుసండి. అయినా వాళ్ల రాతలేవో వాళ్లు రాసుకొనివ్వండి.. మా అక్క సీమంతం జరుగుతుంది. కానీ ఇంత రిచ్ గా కాదు అంటుంది కావ్య. ఇంతలో రుద్రాణి ఏంటి మొగుడు పెళ్లాం ఏదో చెవి కొరుక్కుంటున్నారు అని అడుగుతుంది.
కొరుక్కోవడానికి కొబ్బరి చిప్పలేం లేవని.. మీకెందుకండి చాలా ఉత్సాహంగా ఏర్పాట్ల గురించి ఏదో చర్చిస్తున్నారు కదా..? కానియండి అని చెప్తుంది కావ్య. ఇంతలో రాహుల్ మమ్మీ కొంప దీసి కావ్య ఏమైనా పిట్టింగ్ పెడుతుంది అంటావా…? అని మెల్లగా అడుగుతాడు. అందరి ముందు మాట ఇచ్చింది కదరా..? అంటూ లిస్ట్ తీసుకెళ్లి.. ఇదిగో కావ్య సీమంతానికి మొత్తం ఖర్చు 20 లక్షలు అంటూ ఇస్తుంది. సీమంతానికి 20 లక్షలా అంటూ ప్రకాష్ మెల్లగా ధాన్యలక్ష్మీని అడుగుతాడు. మనం అడిగితే రూపాయి ఇవ్వదు కానీ వాళ్లకు 20 లక్షలు ఇస్తుందా..? ఇవ్వని చూస్తా.. అని ధాన్యలక్ష్మీ చెప్తుంది.
కావ్య 20లక్షల చెక్కును రుద్రాణికి ఇస్తుంది. ఇంతలో కనకం అమ్మా స్వప్న అంటూ వస్తుంది. స్వప్నను ఎలా ఉన్నావమ్మా అంటూ పలకరిస్తుంది. ఇంతలో అపర్ణ మేమే నీకు కబురు చేద్దామనుకున్నాను అని చెప్పగానే.. ఏదైనా విశేషమా వదిన గారు అని కనకం అడుగుతుంది. అవును స్వప్న సీమంతం చేయించడానికి రుద్రాణి ఏర్పాట్లు చేస్తుంది. అని చెప్పగానే కనకం నో అని గట్టిగా అరుస్తుంది. రుద్రాణి సీమంతం చేయించడం ఏంటి నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను అంటుంది. నువ్వు ఒప్పుకోకపోవడం ఏంటి..? నీ పర్మిషన్ ఎవరికి కావాలి అంటుంది రుద్రాణి.
చూడండి మా ఇంటి ఆచారం ప్రకారం మా ఇంటి ఆడబిడ్డకు సీమంతం పుట్టింట్లోనే చేయాలనేది మా వంశాచారం అని కనకం చెప్తుంది. దీంతో రుద్రాణి కోపంగా మా ఇంట్లో నీ కూతురు సీమంతం ఎలా జరిపిస్తామో తెలుసా…? అంటూ నిలదీస్తుంది. అసలు మీకు ఇంత హఠాత్తుగా నా కూతురు మీద ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది. అంటూ అనుమానిస్తుంది కనకం. అన్నయ్యా మీరు నమ్ముతున్నారా..? అంటూ ఇంట్లో అందరినీ అడుగుతుంది. అందరూ తమకు అర్థం కావడం లేదని చెప్తారు. ఎవరేం చెప్పినా మా ఇంట్లోనే సీమంతం జరిపిస్తానని రుద్రాణి చెప్తుంది. దీంతో మా వంశాచారం ప్రకారం మా ఇంట్లో జరిపించడం గొప్పా మీరే చెప్పండి చిన్న వదిన గారు అంటూ ధాన్యలక్ష్మీని అడుగుతుంది కనకం.
ధాన్యలక్ష్మీ కూడా మీ ఇంట్లో జరిపించడమే మేలు అంటుంది. దీంతో రాహుల్, రుద్రాణి, స్వప్న మేము ఒప్పుకోము అంటారు. దీంతో కనకం కోపంగా స్వప్నను తిడుతుంది. తర్వాత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీంతో స్వప్న కూడా సరే అంటుంది. అందరూ ఒప్పుకున్నారా..? ఓకసారి అడుగు అని కనకం చెప్పగానే.. స్వప్న మీ వంశాచారం ప్రకారం నీ సీమంతం మీ ఇంట్లోనే జరగాలి. నీకు పుట్టబోయే బిడ్డకు మంచి జరగాలి. అని ఇందిరాదేవి చెప్పగానే.. ఇక్కడ ఏదో జరుగుతుంది.. కానీ ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటుంది స్వప్న.
ఏమీ జరగడం లేదమ్మా.. మీ అమ్మ నీ మంచి కోసమే. నీ బిడ్డ కోసమే ఇంతలా ఆరాటపడుతుంది అని అపర్ణ చెప్తుంది. ఏం సంప్రదాయమో ఏంటో సరేలే అందరూ ఒప్పుకున్నాక నేను మాత్రం ఏమంటాను.. కనీసం బారసాల అయినా ఇక్కడ జరిపించండి అని చెప్తుంది స్వప్న.. అపర్ణ అలాగే నువ్వు సంతోషంగా ఒప్పుకోమ్మా అంటుంది. స్వప్న అలాగే అంటుంది. కావ్య, రుద్రాణి దగ్గరకు వెళ్లి ఇప్పుడు ఆ 20 లక్షల చెక్‌తో అవసరం లేదు కదా… ఆ చెక్ ఇటు ఇవ్వండి అంటూ చెక్ తీసుకుని చింపేస్తుంది కావ్య. కనకం అందరినీ నా కూతురు సీమంతం మా ఇంట్లో చేస్తాము మీరంతా తప్పకుండా రావాలి చెప్పి వెళ్లిపోతుంది.
కళ్యాణ్ సాంగ్ రాసి అప్పుకు ఫోన్ చేసి తను రాసిన పాట వినిపిస్తాడు. పాట విన్న అప్పు బాధగా ఎమోషనల్ అవుతూ.. చాలా బాగా రాశావు నువ్వు నిజంగా నన్ను ఎంత మిస్ అవుతున్నావో నాకు అర్థం అవుతుంది అని చెప్తుంది. మరోవైపు రుద్రాణి కోపంగా తనకు లైసెన్స్ గన్ కావాలని రాహుల్‌ను అడుగుతుంది. ఎందుకు మమ్మీ అని రాహుల్ అడిగితే నిన్ను చంపేసి నేను జైలుకు వెళ్లడానికి అంటుంది. ఒక్కగానొక్క కొడుకుని నన్ను చంపుతావా..? అంటాడు రాహుల్. ఇడియట్ మనం చనిపోవాలంటే ఎప్పుడో చనిపోయేవాళ్లం అంటుంది రుద్రాణి ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?