Game Changer:గేమ్ ఛేంజర్ (Game Changer).. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్(S. SHANKAR) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. దాదాపు రూ.450 కోట్ల పెట్టుబడితో భారీ అంచనాల మధ్య జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల చేశారు. మొదటి రోజే రూ.186 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిందని మేకర్స్ పోస్టర్తో సహా రిలీజ్ చేశారు. కానీ వారం ముగియకముందే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వస్తున్నాయంటూ మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేయడంతో.. దెబ్బకు హైదరాబాదులో ఐటి అధికారులు ఈ చిత్ర నిర్మాతలపై రైడ్ నిర్వహించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dilraju ), శిరీష్(sirish ) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నిన్న భారీ ఎత్తున శిరీష్, దిల్ రాజు, ఈయన కుమార్తె హన్సిత రెడ్డి ఇల్లు, ఆఫీసులపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
దాతృత్వం చాటుకున్న ఆదిత్య రామ్..
ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమా తమిళ హక్కులను కొనుగోలు చేసిన ప్రముఖ నిర్మాత ఆదిత్య రామ్ (Adithya Ram) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తాజాగా ఈయన తన గొప్ప మనసును చాటుకొని, అందరిని అబ్బురపరిచారు.. మరి ఆదిత్య రామ్ చేసిన ఆ గొప్ప పని ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఆదిత్య రామ్ విషయానికి వస్తే.. పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన ఈయన పలు బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెట్టి తమిళనాడులోని స్థిరపడ్డారు. ఇక ప్రాణం సంపాదించిన డబ్బును తనకోసం మాత్రమే ఉపయోగించుకోకుండా.. తన పేరు మీద ఒక ప్యాలెస్ నిర్మించి( ఆదిత్య రామ్ ప్యాలెస్ ) దాని ద్వారా వేలాదిమంది అవసరార్థులకు కావలసిన సహాయాన్ని అందిస్తూ ఉంటారు.
5000 మందికి నిత్యవసర సరుకులు అందించిన ఆదిత్య రామ్..
ముఖ్యంగా ఆదిత్య రామ్ కు అమలాపురం అల్లుడుగా, ఒక తెలుగువాడిగా చెన్నైలో మంచి పేరు ఉంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు ఆయన ఏకంగా 5000 మందికిపైగా వారి ఇంటి అవసరాలకు కావలసిన నిత్యవసర సరుకులను అందించారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్స్ ఆదిత్యా రామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కాలంలో కూడా ఇలా ఒకరికి సహాయం చేయాలనే ఆలోచన పుట్టడం చాలా ప్రశంసనీయం అంటూ ఆదిత్య రామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆదిత్య రామ్ కెరియర్..
ఆదిత్య రామ్ విషయానికి వస్తే 1980 సెప్టెంబర్ 26వ తేదీన జగన్నాథపురంలో జన్మించిన ఈయన, ఆదిత్య గ్రూప్ ఆర్గనైజేషన్ స్థాపించి, వందల మందికి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. బిజినెస్ మాన్ గా పేరు దక్కించుకున్న ఆదిత్యా రామ్ రియల్ ఎస్టేట్ టైకూన్ గా కూడా పేరు సొంతం చేసుకోవడం గమనార్హం. ఏది ఏమైనా సంపాదించిన డబ్బులో పావులాభాగం ఇతరులకు పంచి పెట్టాలనే ఆలోచన ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది అని చెప్పవచ్చు.