Intinti Ramayanam Today Episode January 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రియ శ్రీకర్లు చూడటానికి ఇంటికి వస్తారు. రాజేంద్రప్రసాద్ మాత్రం మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అరుస్తాడు.. ఇంట్లోంచి వెళ్లిపొమ్మని గెంటేస్తాడు. పార్వతి మాత్రం తన కొడుకు ఇంట్లోకి వస్తే తప్పేంటని రాజేంద్రప్రసాద్ ని నిలదీస్తుంది. ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది.. అవని శ్రీకర్ నేను రావద్దని చెప్పాను కదా మరి ఎందుకు వచ్చావు అని అంటుంది. బలవంతంగా శ్రీకర్ని శ్రీయాను ఇంట్లోంచి బయటకు వెళ్లమని చెబుతుంది. ఇది మాత్రం టెన్షన్ పడుతుంది.. అవని వాళ్ళని ఇంట్లోంచి బయటికి వెళ్లడం ఏంటని పల్లవి పార్వతికి మళ్లీ నూరిపోస్తుంది. పార్వతి నాదంతా అర్థమైంది నువ్వేం చెప్పద్దు అని అంటుంది.. ఇక అవని నేను బయటకు వెళ్తున్నానని చెప్తుంది. అక్షయ్ ఆగు నేను రెడీ చేసి వస్తాను అనేసి అంటే వద్దు అవసరం లేదండి నేను వెళ్లేసీ వస్తానని అంటుంది. సరే ఎక్కడికి వెళ్తున్నావు అదన్న చెప్పు అని అక్షయ్ అడుగుతాడు. అవని నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తుంది. అయితే నేను వస్తాను నీకు ఏం తెలుసు నువ్వు వెళ్తున్నావు ఆస్తి గురించి నీకు ఏదైనా తెలుసా అంటాడు కానీ అక్షయ్ ని మీరు వద్దండి నేనే వెళ్లి నాకు తెలుసు ఎలా చేయాలో అలా చేయించి మీకు సర్ప్రైజ్ ఇస్తానని అంటుంది. పల్లవి వస్తానని అన్నా కూడా అవని వద్దని చెబుతుంది.. ఇక లాయర్ తో మాట్లాడి అంత సిద్ధం చేయమని అవని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని వెళ్ళగానే పల్లవి చక్రధారిని రమ్మని చెప్పి ఈ విషయాన్ని చక్రధరకి చెప్తుంది.. ఇక చక్రధర్ ఆ పనిని చెడ్డ చేయాలంటే అవని రాసిస్తున్న డాక్యుమెంట్స్ కి ఆపోజిట్ గా మనం రాయించాలి అని అంటాడు. మరి వేరే లాయర్ ని చూడండి డాడి అని పల్లవి అంటే వేరే లాయర్ ఎందుకు అమ్మ డబ్బులుకి అమ్ముడు పోనీ లాయర్ అంటూ ఉండడు కదా ఇదే లాయర్ చేత మనం ఆ పని చేద్దాం అని అంటాడు. దానికి అసలు మా ఫ్యామిలీ లాయర్ కదా అసలు ఒప్పుకుంటాడు అంటావా ఇంట్లో తెలిస్తే ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అంటే అదంతా నేను చూసుకుంటాను పదా వెళ్దామని లాయర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్తారు. మొదట లాయరు ఈ విషయానికి ఒప్పుకోడు తర్వాత డబ్బులు ఆశ చూపించడంతో చేస్తానని ఒప్పుకుంటాడు. అవని అనుకున్నట్లుగా ఒక డాక్యుమెంట్ రాయండి మేము అనుకున్నట్లుగా ఇంకొక డాక్యుమెంట్ రాయండి మేము సాయంత్రం వచ్చి ఆ డాక్యుమెంట్ ని తీసుకుంటాం ఆ తర్వాత మీకు ఎంత డబ్బులు కావాలో అంతా మీరు తీసుకోండి అని అంటాడు.
ఇక అవని అనుకున్న విధంగా డాక్యుమెంట్స్ ని రాసి ఇంటికి తీసుకొస్తుంది. నీ గురించి ఒకసారి మావయ్యకి చెప్పాలని వెళ్లి రాజేంద్రప్రసాద్ కి చెప్తుంది. మామయ్య మీరంటే గౌరవం లేక కాదు నిర్ణయం అంటే విలువ లేక కాదు.. ఆస్తిని అందరి పేరు మీద సమానంగా రాయించాలని నేను ఆయన అనుకున్న మావయ్య అలానే వీలునామ రాయించాం మీరు ఇంకేది కాదనకండి అనేసి అడుగుతుంది. దానికి రాజేంద్రప్రసాద్ మాత్రం నేను ఏదో తక్కువని మీకు రాయడం లేదు ఈ ఆస్తి మొత్తం అక్షయ్ వాళ్ళ అమ్మ అనురాధదే అందుకే వాడికి రాసాను వాడు సమర్ధుడు రేపు ఏదైనా జరిగినా వాడు తన తమ్ముళ్ళని చెల్లెలు చూసుకుంటాడని దూరపు ఆలోచనతోనే నేను రాశాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయినా పర్లేదు. మేము ఎలా చూడాలి అలా చూస్తాం మామయ్య మీరు ఈ దాన్ని ఒప్పుకోండి అంటే ఇక మీ ఇష్టం అనేసి అంటాడు. రాజేంద్రప్రసాద్ ను శ్రీకర్ని ఇంటికి తీసుకుని రావడానికి అడుగుతుంది. ఇది ఒక్కసారి నేను ఒప్పుకుంటానని రాజేంద్రప్రసాద్ అంటాడు. పల్లవి పార్వతీ మనసులో మళ్ళీ అవని పై అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది.
పార్వతి మాత్రం అంత నాకు తెలుసు అన్నట్లు మాట్లాడుతుంది.. ఇక కమల్ ఆరాధ్య దగ్గరికి వస్తాడు. ఇంట్లో వాళ్ళందరూమూడిగా ఉన్నారు కదా బంగారం. మనం ఏదైనా స్వీట్ చేసి వాళ్ళకి పెడదామా అనేసి అంటాడు. సరే బాబాయ్ అని ఆరాధ్య కమలిద్దరూ కలిసి స్వీట్ చేస్తారు. భానుమతి ఆ వాసనకి వంటగదిలోకి వస్తుంది. ఇక కమల్ స్వీట్ అయ్యాక దాంట్లో మోషన్ టాబ్లెట్ వేసి భానుమతికిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవని రాయించిన డాక్యుమెంట్స్ ని పల్లవి మార్చేస్తుందా లేదా చూడాలి..