Janasena: వ్యక్తికి కాలం కలిసి వస్తే.. ఆయన్ని ఎవరు పట్టుకోలేదు. ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఈ సామెత జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అతికినట్టు సరిపోతుంది. మోదీ సర్కార్‌లో పవన్‌కు ఊహించని గుర్తింపు వచ్చింది. అలాగే ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం తీపికబురు చెప్పేసింది. దీంతో జనసేన కార్యకర్తల్లో ఆనందాలు మిన్నంటాయి.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆయన ఏది పట్టుకున్నా తిరుగులేదు. ఈ విషయాన్ని జనసేన పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. మరో పదేళ్లు అంటే ఆయనకు రాజయోగం ఉందని అంటున్నారు. దశాబ్దంపాటు ఆయన పడిన కష్టాలకు పుల్‌స్టాప్ పడిందని అంటున్నారు.
ఈ మధ్య కొందరు జ్యోతిష్యులు జనసేన పార్టీకి వచ్చారట. ఆ సమయంలో పార్టీ వాస్తు, పవన్ జాతకం చూసి చాలా బేషుగ్గా ఉందని చెప్పారట. పదేళ్ల పాటు తిరుగులేదని చెప్పినట్టు సమాచారం. వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలని చెప్పారట. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని, ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారట. ఈ విషయం తెలియగానే జనసేన కార్యకర్తలు ఫుల్‌ఖుషీ అవుతున్నారు.
మొన్నటి ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం విజయం సాధించింది. ఇది ఆశామాషీ విజయం కాదు. ఈ విషయం అధినేతకు సైతం తెలుసు. ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు గెలవని నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. అవన్నీ బీజేపీ ఖాతాలో పడ్డాయి. దీంతో ప్రధాని మోదీ దగ్గర ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగింది.
ALSO READ: గీత కార్మికులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
పవన్ ఏది కోరినా తాము చేసేందుకు సిద్ధంగా ఉంటామని ఆ మధ్య కొందరు కేంద్రమంత్రులు సైతం చెప్పారంటే ఆయనకు మోదీ సర్కార్ ఎంత విలువ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ అడగ్గానే మంత్రులు ఆయనకు ఇస్తున్నారు. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని ఆలోచన చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఇదే సమయంలో జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీల జాబితాలోకి జనసేనను చేర్చింది. ఆ పార్టీకి శాశ్వత చిహ్నంగా గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు ఓ లేఖ వచ్చింది.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ సేవలను వినియోగించుకోవాలన్నది కమలనాధుల ప్లాన్. దీనికి సంబంధించి తెర వెనుక వ్యూహాలు రచిస్తోంది. అక్కడ చిన్నచిన్న పార్టీలతో మంతనాలు సాగుతున్నాయి. రేపటి రోజున విజయ్ కూడా బీజేపీతో కలిసి ఎన్నికలు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
దక్షిణాదిలో బీజేపీ తరపున బలమైన వాయిస్ వినిపించే ప్రజాదరణ కలిగిన నేత లేరు. దీనికి పవన్ కరెక్టుగా సూటబుల్ అవుతాడని భావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాధిలో సీట్లు తగ్గినా, దక్షిణాది ద్వారా గటెక్క వచ్చన్నది కమలనాధుల ఆలోచన.