Allu Arjun Case – BRS YCP: రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. మొన్నటి వరకు ఓ రేంజ్ లో చర్చలు సాగినా, ఇప్పుడు పొలిటికల్ టచ్ తో మరింతగా రచ్చబండ చర్చలు సాగుతున్నాయి. ఇంతకు ఆ టాపిక్ కూడా మీకు తెలిసిందే. అదేనండీ అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ప్రజల మద్దతు ఉన్నప్పటికీ, కొన్ని పార్టీలు మాత్రం ఇదే అదునుగా భావించి తెగ కామెంట్స్ చేస్తున్నాయి.
పుష్ప 2 సినిమా క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ అయింది. హిట్ కూడా కొట్టింది. ఈ సినిమా విడుదలైన సమయం ఏమో కానీ సంధ్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటన మాత్రం ఇప్పుడిప్పుడే బన్నీని వదిలేలా లేదు. సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మారిటీ చెందారు. అలాగే ఓ బాబు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. చట్టం తన పని తాను చేసుకు పోతుందనే రీతిలో కేసు నమోదైంది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. వెంటనే బెయిల్ పై కూడా విడుదలయ్యారు. తాజాగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు అల్లు అర్జున్ నిర్లక్ష్య వైఖరి కారణమంటూ కామెంట్స్ చేశారు.
ఇలా ఒక ప్రాణం పోయింది. మరో బాబు హాస్పిటల్ పాలయ్యాడు. ప్రభుత్వం తరపున భాదిత కుటుంబానికి రూ. 25 లక్షలు కూడా అందజేశారు. అయితే ఇక్కడే రెండు పార్టీలు మాత్రం భిన్న వాదన వినిపిస్తూ, ఇదే మా నినాదం అంటూ చాటింపు వేస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ హీరో అల్లు అర్జున్ కు అండగా నిలుస్తున్నాయి. అది కూడా కేసులో అలా అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే, బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు అరెస్ట్ అప్రజాస్వామ్యమని నినదించాయి. కానీ భాదిత కుటుంబానికి మద్దతుగా ఒక్క మాట కూడా వీరు పలకలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హీరో హీరోనే కానీ, అక్కడ ఓ తల్లి తన కుమార్తెకు దూరమైంది. ఓ కొడుకు తల్లికి దూరమయ్యాడు. ఈ విషయంపై ఒక్క మాట కూడా రెండు పార్టీల నేతలు నోరు మెదపలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
తమ పార్టీల ఉనికిని కాపాడుకొనేందుకు, సినిమా రంగం మద్దతు కూడగట్టుకొనేందుకు బీఆర్ఎస్, వైసీపీ లు అదేపనిగా అల్లు అర్జున్ ను మోస్తున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒక పేద కుటుంబంలో జరిగిన దుర్ఘటనపై మాట్లాడని నోర్లు, ఇప్పుడు అల్లు అర్జున్ కు మద్దతుగా స్వరం కలపడంపై స్వంత పార్టీల నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా అల్లు అర్జున్ విషయంలో బీఆర్ఎస్, వైసీపీ ముందుగా స్పందించి, ఇప్పుడు ప్రజా మద్దతు భాదిత కుటుంబానికి రావడంతో నాలుక్కరుచుకున్నాయట!