E-Paper
Advertisement

Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం రావడం పక్కా.. మేకర్స్ స్పెషల్ ప్రకటన

Game Changer Pre Release Event: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం రావడం పక్కా.. మేకర్స్ స్పెషల్ ప్రకటన
Advertisement

Game Changer Pre Release Event: సినిమా ప్రమోషన్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అవి సినిమాకు ఎక్కువ రీచ్ వచ్చేలా కూడా చేస్తాయి. అందుకే ఎలాగైనా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. అలాగే ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ మాస్టర్ ప్లానే వేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా తెలిపారు. ఈ ఈవెంట్‌కు రమ్మని నిర్మాత అయిన దిల్ రాజు స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు. ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు కూడా బయటికొచ్చాయి. ఇక తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ రావడం పక్కా అంటూ అధికారికంగా ప్రకటించింది టీమ్.

రాజమండ్రిలో ఈవెంట్

Advertisement

శంకర్ (Shankar), రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు దాటుకుంటూ వచ్చి ఫైనల్‌గా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. అందుకే ప్రమోషన్స్ విషయంలో మూవీ టీమ్ వేగం పెంచింది. ముందుగా అమెరికాలోని డల్లాస్ నుండి ఈ ప్రమోషన్స్ మొదలయ్యాయి. రామ్ చరణ్‌తో పాటు మేకర్స్ కూడా డల్లాస్‌కు వెళ్లి ఆడియో ఫంక్షన్ చేసుకొని వచ్చారు. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను సింపుల్‌గా ఏఎమ్‌బీ థియేటర్‌లో చేసేశారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాత్రం గ్రాండ్‌గా చేయాలని ఫిక్స్ అయ్యారు. దానికోసం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిని సెలక్ట్ చేసుకున్నారు.

Also Read: ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్.? శంకర్ మాటలకు అర్థం అదేనా.?

Advertisement

క్లారిటీ వచ్చేసింది

ప్రస్తుతం రామ్ చరణ్ బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అందుకే తన కెరీర్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దానికోసం రాజమండ్రిని సెలక్ట్ చేశారు. దానికి కావాల్సిన అనుమతుల కోసం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రమ్మని ఆహ్వానించడం కోసం పవన్ కళ్యాణ్‌ను నేరుగా కలిశారు దిల్ రాజు. ఆ మీటింగ్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌కు వస్తారా రారా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆ క్లారిటీ వచ్చేసింది.

మెగా ఈవెంట్

జనవరి 4న రాజమండ్రిలో జరగనున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ వస్తున్నారని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ‘పవర్ ప్యాక్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు’ అని పోస్ట్ చేశారు. ఈ మెగా ఈవెంట్ చాలా భారీగా ఉండబోతుందని ధీమా ఇచ్చారు. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది చూసిన తర్వాత సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×