BigTV English

RBI Rs. 2000 Notes : ఇంకా జనాల వద్దే రూ.2 వేల నోట్లు.. ఏకంగా రూ.6 వేల కోట్లు, ఆ నోట్లన్నీ ఏమయ్యాయి?

RBI Rs. 2000 Notes : ఇంకా జనాల వద్దే రూ.2 వేల నోట్లు.. ఏకంగా రూ.6 వేల కోట్లు, ఆ నోట్లన్నీ ఏమయ్యాయి?

RBI Rs. 2000 Notes : జేబులో తళతళమెరిసిపోయిన రూ.2 వేల రూపాయల నోటు చాన్నాళ్లుగా కనిపించడం లేదు. 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ నోట్లు, ఇప్పుడు చూద్దామన్నా ఎక్కడా కనిపించడం లేదేంటని ఆలోచిస్తున్నారా.? లేదా.. మీ బీరువాలోనో, మీ పరుపు కిందో జాగ్రత్తగా దాచిన నోట్లను చూసి మురిసిపోతున్నారా.? అయితే మీరు ఇంకా ఈ నోట్ల ముచ్చట పూర్తిగా తెలుసుకున్నట్లు లేరు.


రూ.2,000 నోట్లను దేశీయ మార్కెట్లో వినియోగం నుంచి ఆర్భీఐ ఎప్పుడో తీసేసింది. అవును.. ఈ నోట్లు ఇప్పుడు వినియోగంలో లేవు. ఆగండి.. ఆగండి.. అంటే అప్పట్లో రూ.1000, రూ.500 నోట్ల రద్దులా పూర్తిగా పనికి రాకుండా పోలేదు. కేవలం వినియోగంలో లేవు అంతే. తేడా ఏంటి అంటారా.. ఏంటంటే.. ఈ నోట్ల విలువను ఆర్బీఐ రద్దు చేయలేదు. కేవలం.. మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటోంది. అంటే.. బ్యాంకుల ద్వారా ఈ నోట్లను ఎవరికీ ఇవ్వరు.బ్యాంకుల దగ్గరకు వచ్చిన నోట్లన్నింటినీ సేకరించి.. ఆర్భీఐ దగ్గరకు పంపుతారు. అలా.. ఆర్బీఐ జారీ చేసిన రూ.2 వేల నోట్లన్నీ తిరిగి వచ్చేసిన తర్వాత.. వాటిని రద్దు చేసే అవకాశాలున్నాయి. అప్పుడు.. ఇవి పనికిరాని చిత్తుకాగితాలే అన్నమాట. మరి… ఇప్పటికీ మీ దగ్గరున్న నోట్లను ఎలా మార్చుకోవాలో తెలుసా..

ఆర్భీఐ కీలక ప్రకటన


పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రవేశపెట్టిన రూ.2,000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనకి తీసేసుకుంది. అప్పటి అవసరాలు మేరకు ఈ నోట్లను ముద్రించి వినియోగంలోకి తీసుకువచ్చిన ఆర్బీఐ… ఇప్పుడు వీటి అవసరం తీరడంతో వ్యవస్థ నుంచి తొలగిస్తోంది. ఇందులో భాగంగానే.. 2023 మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో సామాన్య జనం నుంచి వ్యాపారుల వరకు.. వారి దగ్గరున్న రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకున్నారు. కాగా తాజాగా ఆర్బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. దేశీయ విపణిలో ఉన్న మొత్తం రూ.2 నోట్లలో దాదాపు 98.12% తిరిగి వచ్చేసినట్లు తెలిపింది. ప్రజల వద్ద ఇంకా.. 6,991 కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ డబ్బులు సైతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తే.. రూ.2 వేల నోట్ల విలువను పూర్తిగా రద్దు చేయాలని భావిస్తోంది. కానీ.. రోజులు గడుస్తున్నా.. అవి మాత్రం తిరిగి రావడం లేదు.

ఎప్పుడు వస్తుందని ఆర్మీ ఎదురుచూస్తుంది కానీ ఇప్పటివరకు అవి తిరిగి బ్యాంకులు చేరుకుపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్బిఐ కీలక మార్గదర్శకలను విడుదల చేసింది మీ వద్ద 2000 రూపాయల నోట్లు ఉంటే వాటిని ఏ విధంగా మార్చుకోవచ్చు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.కాగా.. 2023 మే నెలలో రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన చేసే నాటికి దేశీయ విపణిలో ఏకంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్భీఐ వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా వాటిని విపణి నుంచి తిరిగి ఉపసంహరించుకుంటూ వస్తున్న ఆర్బీఐ..మొదట్లో దేశంలోని అన్ని బ్యాంక్ శాఖల్లో వీటిని మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడు మాత్రం..బ్యాంకులు వీడిని స్వీకరించేందుకు, మార్పిడి చేసేందుకు అనుమతి లేదు. దీంతో.. ప్రత్యామ్నాయంగా.. దేశంలోని 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనే ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

రూ.2000 నోట్లను ఇలా మార్చేసుకోండి

మీ దగ్గర ఇంకా రూ.2 వేల నోట్లు ఉంటే వాటిని మార్చుకునేందుకు ఆర్బీఐ సులభతర విధానాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆర్భీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. ఈ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్ కత్తా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూదిల్లీ, పాట్నా మరియు తిరువనంతపురంలోని కార్యాలయాల్లో నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు లేదా మార్పిడి చేసుకోవచ్చు

మరో మార్గంలో సామాన్యులకు ఉపయోగపడేలా.. వారు పెద్ద నగరాల్లోని కార్యాలయాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో తపాలా శాఖ ద్వారా రూ.2 వేల నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. ఇందు కోసం ఇన్సూర్డ్ పోస్ట్ లేదా టీఎల్ఆర్ అనే రక్షణ కలిగిన కవర్ ని వినియోగించుకొని సురక్షితమైన మార్గంలో ఈ రూ.2 వేల నోట్లని మార్చుకోవచ్చని పోస్టల్ అధికారులు వెల్లడిస్తున్నారు.

Also Read :  బ్లింక్ ఇట్ కొత్త సేవలు… క్షణాల్లోనే మీ దగ్గరకు అంబులెన్స్ అంటున్న సంస్థ

ఇందులో భాగంగా పోస్టల్ శాఖ జారీ చేసే ప్రత్యేక అప్లికేషన్ ను నోట్లు మార్చుకునేవారు పూర్తి చేయాల్సి ఉంటుంది ఇందులో వారి వ్యక్తిగత వివరాలతో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ ను జత చేసి పోస్ట్ ఆఫీసులో రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నిటినీ ఆర్బీఐ తనిఖీ చేసి వివరాలను సరిచూసుకుని రూ.2 వేల నోట్లను మార్పిడి చేసి.. ఆ సొమ్మును అప్లికేషన్ లో అందించిన బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేస్తుంది. ఒక వ్యక్తి ఒకేసారి గరిష్టంగా రూ.2 లక్షలు ఈ విధానంలో నోట్ల మార్పిడి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×