Game Changer: ఒక తమిళ దర్శకుడు, ఒక తెలుగు హీరో కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందా అనే టెన్షన్ చాలామంది ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ ఎన్నో ఏళ్లుగా కేవలం తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తూ పాన్ ఇండియా అనే ట్యాగ్ ప్రేక్షకులకు తెలియని సమయంలోనే వారికి దానిని పరిచయం చేసిన దర్శకుడు శంకర్.. గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్‌తో సినిమా అనగానే ఆడియన్స్‌లో టెన్షన్ కంటే అంచనాలే భారీగా పెరిగిపోయాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ (Game Changer)ఎన్నో అడ్డంకులను దాటుకొని జనవరి 10న విడుదల కానుంది. ఇదే సమయంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆడియన్స్‌లో కొత్త డౌట్స్ క్రియేట్ అయ్యేలా చేశాడు దర్శకుడు శంకర్.
వేర్వేరు క్యారెక్టర్లు.?
‘గేమ్ చేంజర్’లో రామ్ చరణ్ తానే తండ్రిగా, తానే కొడుకుగా కనిపించనున్నాడని ఇప్పటికే రివీల్ అయ్యింది. అందులో కొడుకుగా కనిపించే రామ్ చరణ్ (Ram Charan) ఐఏఎస్ క్యారెక్టర్‌లో నటించనున్నాడని స్పష్టం చేశారు మేకర్స్. అయితే ఈ రెండు క్యారెక్టర్స్ కాకుండా మరొక స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఇది వేరే క్యారెక్టర్ అయ్యింటుందేమో అనే డౌట్ అసలు ప్రేక్షకులకు రాలేదు. కానీ ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ ఏం చెప్పినా చేస్తాడని, తను ఐఏఎస్ ఆఫీసర్‌లాగా బాగా సెట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఒక గడ్డం ఉన్న క్యారెక్టర్‌లో కూడా తను బాగా కనిపించాడని అన్నాడు. అంటే ఆ రెండు వేర్వేరు క్యారెక్టర్లా అనే అనుమానం ప్రేక్షకుల్లో మొదలయ్యింది.
Also Read: ఊర్వశితో బాలయ్య దబిడి దిబిడి.. ఫుల్ సాంగ్ వచ్చేసింది
ఎన్నో ప్రయోగాలు
ఇన్నాళ్ల ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ప్రేక్షకులను వెయిట్ చేయించినందుకు చాలావరకు ఈ మూవీపై బజ్ లేదు. కానీ ఒక్కొక్క అప్డేట్ విడుదల అవుతుంటే అందరూ దీని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సాంగ్స్‌లో శంకర్ మార్క్ కనిపిస్తుందని, టీజర్, ట్రైలర్ బాగున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘గేమ్ చేంజర్’ ట్రైలర్‌ను రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్. అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకున్నాడు శంకర్. వీడియో సాంగ్స్‌లో కొత్త ప్రయోగాలు చేశామని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.
తమన్‌పై ప్రశంసలు
మామూలుగా శంకర్ (Shankar) దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది అంటే దానికి కచ్చితంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తాడని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ మొదటిసారి ‘గేమ్ చేంజర్’ కోసం తమన్‌తో ప్రయోగం చేశాడు శంకర్. తమన్ కూడా తన అంచనాలకు తగినట్టు మ్యూజిక్ అందించాడని ప్రశంసించారు. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరి గురించి కూడా శంకర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఒక్కడు’, ‘పోకిరి’ లాంటి సినిమాలు తనకు ఇష్టమని, ‘గేమ్ చేంజర్’ కూడా తాను అలాగే తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. తన నుండి ప్రేక్షకులు ఆశించే ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయని హామీ ఇచ్చారు. మొత్తానికి జనవరి 10న విడుదలవుతున్న ‘గేమ్ చేంజర్’పై అంచనాలు పెంచేశారు.