Dil Raju: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలు పెట్టిన దిల్ రాజు తర్వాత నిర్మాతగా కూడా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. దిల్ సినిమాతో నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టిన రాజు ఇప్పటికీ దాదాపు 50 సినిమాలు పైగా నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా వెళ్లి ఆ సినిమాను చూసేవాళ్ళు. దిల్ రాజు జడ్జిమెంట్ కు కూడా మంచి వ్యాల్యూ ఉంది. అందుకే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సక్సెస్ రేట్ బాగా ఎక్కువగా ఉందని చెప్పాలి.
Also Read: Bandla Ganesh: గురూజీని అప్పుడు బండబూతులు తిట్టి.. ఇప్పుడు బర్త్ డే విషెస్ చెప్తున్నావా అన్నా.. ?
ప్రస్తుతం ఈ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. వాస్తవానికి ఈ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఈ సినిమాతో పాటుగా చేసిన భారతీయుడు 2 సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక గేమ్ చేంజెర్ సినిమాను సంక్రాంతి కానుక రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మొదటి ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల అవుతుంది అని అందరూ ఊహించారు. కానీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి ప్రతిసారి సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది.
ఈ సినిమా టీజర్ గురించి చాలామంది ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు ఎక్కడ కనిపించినా కూడా గేమ్ చేంజర్ అని ప్రేక్షకులు అరుస్తూ ఉండటం. ఆ తరుణంలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వటమనేది కామన్ గా జరుగుతూ వస్తుంది. ఇక రీసెంట్ గా కంగువ మూవీ ఈవెంట్ కి వచ్చారు దిల్ రాజు. దిల్ రాజు మాట్లాడిన తర్వాత ఇంకో 48 గంటల్లో మీరు గేమ్ చేంజర్ టీజర్ చూడబోతున్నారు అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించాడు. ఈ సినిమా నుంచి పలు రకాల ఫొటోస్ ఇప్పటివరకు లీక్ అవుతూ వచ్చాయి. శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఆర్ ఆర్ వంటి హిట్ సినిమా తర్వాత చరణ్ కంప్లీట్ లీడ్ రోల్ లో కనిపిస్తున్న సినిమా కూడా ఇదే. అందుకనే ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇక కార్తీక్ సుబ్బరాజు కథ కాబట్టి ఆసక్తి ఇంకా కొంచెం పెరుగుతుందని చెప్పాలి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది అని అందరికీ ఒక క్లారిటీ వస్తుంది.