Bandla Ganesh: బండ్ల గణేష్.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన బండ్ల గణేష్.. నిర్మాతగా , రాజకీయ నేతగా సుపరిచితుడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమాని.. కాదుకాదు భక్తుడు అని చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో బండ్లన్నకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. సినిమాల్లో హీరోలకు డైరెక్టర్స్ ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తారో.. అంతకుమించిన ఎలివేషన్స్ హీరోలకు ఇవ్వడంలో బండ్లన్న దిట్ట.
ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా.. ఈ ఒక్క డైలాగ్ ను మర్చిపోవడం అనేది పవన్ ఫ్యాన్స్ కు చాలా కష్టతరంతో కూడుకున్న పని. పవన్ నటించిన ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్లన్న స్పీచ్ ఉంటుంది. ఉండాలని కోరుకొనే అభిమానులు ఎంతోమంది. అయితే దేవుడిలా పవన్ ను ఆరాధించే బండ్లన్న.. ఆయనకు దూరం అయ్యాడు. అందుకు కారణం త్రివిక్రమ్. ఈ విషయన్నీ బండ్ల గణేష్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అది కూడా బండబూతులు తిట్టి మరీ చెప్పాడు.
Anushka Shetty: ఒక వేశ్య.. ఇంత బ్రూటల్ గా హత్యలు చేస్తుందా..?
త్రివిక్రమ్ ను వాడు వీడు అని సంబోధించాడు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్ రావాలని కొంతమంది ఫ్యాన్స్ ఆయనకు ఫోన్ చేసి అడిగినప్పుడు.. తాను రావడం లేదని, త్రివిక్రమ్ గాడు తనను అవుతున్నాడని, వాడివలనే పవన్ కు దూరమవుతున్నట్లు చెప్పుకొచ్చాడు.అప్పట్లో ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ తరువాత ఆ వాయిస్ తనది కాదని, మిమిక్రీ చేసారని కొన్నిరోజులు చెప్పాడు. ఇంకొన్నిరోజుల తరువాత ఒక ఇంటర్వ్యూ లో ఆ మాటలు మాట్లాడింది తానే అని చెప్పాడు. కోపంలో వంద అంటాం.. అన్ని పట్టించుకుంటరా అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా త్రివిక్రమ్ ను క్షమాపణలు కోరాడు. పవన్ – త్రివిక్రమ్ వలనే తనకు గబ్బర్ సింగ్ లాంటి సినిమాకు నిర్మాతగా మారే ఛాన్స్ వచ్చిందని తెలిపాడు.
Vikrant Massey: ‘12త్ ఫెయిల్’ హీరోకు హత్య బెదిరింపులు.. ఆ సినిమాలో నటించడమే కారణమా?
ఇక ఇప్పుడు అంతా ప్రశాంతంగా నడుస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బండ్లన్న ఎక్కువ వివాదాలు అయ్యే పోస్టులు కూడా ఏమి పెట్టడం లేదు. అయితే తాజాగా నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో..ఎక్స్ వేదికగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపాడు.
” శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ బండ్లన్న గురూజీకి బర్త్ డే విషెస్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసినా అభిమానులు గురూజీని అప్పుడు బండబూతులు తిట్టి.. ఇప్పుడు బర్త్ డే విషెస్ చెప్తున్నావా అన్నా.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.