BigTV English

Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూడొచ్చు అంటే.. ?

Game Changer: గేమ్ ఛేంజర్ టీజర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూడొచ్చు అంటే.. ?

Game Changer: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఇంకో రెండు రోజుల్లో రాబోతుంది అని పాడేసుకుంటున్నారు  మెగా ఫ్యాన్స్. ఆ రేంజ్ గా పాడుకోవడానికి కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన  గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ అవ్వడమే.  ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.


ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్   ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడు  ఎప్పుడు అని సోషల్ మీడియాను షేక్ చేసిన అభిమానులకు.. ఎట్టకేలకు దీవాళీ రోజున మేకర్స్ ఒక గుడ్ న్యూస్ తెలిపారు. న‌వంబ‌ర్ 9న ల‌క్నోలో ఈ మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Kanguva: మన్నింపు.. సాంగ్ బావుంది కానీ, ఎక్కడో చూసినట్టుందే..?


ఇక ఇంకో రెండు రోజులు మాత్రమే టైమ్ ఉండడంతో ఎప్పుడెప్పుడు ఆ సమయం వస్తుందా.. ? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.  అయితే టీజర్ లక్నోలో కదా.. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్ అసహనానికి గురి కావాల్సిన పనే లేదు. ఎందుకంటే.. రెండు తెలుగురాష్ట్రాల్లో 11 చోట్ల.. గేమ్ ఛేంజర్ టీజర్ ను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అవునా.. నిజమా..  అయితే ఆ  11 థియేటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అడిగితే.. ఆ లిస్ట్ కూడా వచ్చేసింది.

హైద‌రాబాద్‌-సుద‌ర్శ‌న్‌, వైజాగ్‌- సంగం శ‌ర‌త్‌, రాజ‌మండ్రి-శివ జ్యోతి, విజ‌య‌వాడ‌-శైల‌జ‌, క‌ర్నూల్- వి మెగా, నెల్లూర్‌-ఎస్2 థియేట‌ర్‌, బెంగ‌ళూర్‌- ఊర్వ‌శి థియేట‌ర్‌, అనంత‌పూర్‌-త్రివేణి, తిరుప‌తి-పి.జి.ఆర్‌, ఖ‌మ్మం-ఎస్‌వీసీ శ్రీతిరుమ‌ల‌. ఈ సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ గా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రిలీజ్ డేట్ల తరువాత  జనవరి 10 న సంక్రాంతి రేస్ లో  గేమ్ ఛేంజర్ దిగుతున్నాడు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×