ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి అబ్బురపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను మెప్పించి, ఆస్కార్ రెడ్ కార్పెట్ పై దర్శనమిచ్చారు. ముఖ్యంగా కూతురు పుట్టిన తర్వాత రామ్ చరణ్ కి బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. అదే స్పీడ్ లో దూసుకుపోతూ వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer).
సంక్రాంతికి ముస్తాబవుతున్న గేమ్ ఛేంజర్..
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్ (S. Shankar) దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు(Dilraju)నిర్మిస్తున్న చిత్రం ఇది. భారీ బడ్జెట్లో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే అమెరికాలోని డల్లాస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar) చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఇక ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ ను థియేటర్లో విడుదల చేయడానికి మేకర్స్ డేట్ కూడా లాక్ చేసినట్లు సమాచారం
థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్..
ప్రస్తుతం ట్రైలర్ కట్ వర్క్ జరుగుతోందట. ఇక డిసెంబర్ 27వ తేదీన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకున్నారు. కానీ ఎందుకో వాయిదా వేశారు. అందులో భాగంగానే డిసెంబర్ 30వ తేదీన హైదరాబాద్ వేదికగా ఈ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇకపోతే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కి సర్వం సిద్ధం చేస్తుండగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను లక్నోలో చాలా గ్రాండ్ గా ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కి కూడా అలాంటి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.
ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇదిలా ఉండగా మరొకవైపు వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ఏపీలో కూడా గ్రాండ్గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి రియల్ గేమ్ ఛేంజర్ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈవెంట్ కి అభిమానులు కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మరొకవైపు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద కటౌట్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈనెల 29వ తేదీన 250 అడుగుల గేమ్ ఛేంజర్ లోని రామ్ చరణ్ గెటప్తో కటౌట్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మెగా అభిమానులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని ఇప్పుడు భారీ కటౌట్ తోనే నిరూపిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.