AP Krishna District: ఇద్దరు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా, వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకు గొడవకు కారణమేంటో తెలుసా.. అక్షరాల రూ. 300 మాత్రమే.
ఆవేశం అనర్ధదాయకం, తన కోపమే తనకు శత్రువు అనే మాటలను పెద్దలు అంటారు. ఆవేశంతో చేసే పనులు, కీడును తలపెడతాయని పెద్దలు చెప్తుంటారు. అలాంటిదే ఈ ఘటన. చిన్న విషయానికి ఘర్షణకు పాల్పడడంతో, ఒకరు మృతి చెందిన ఘటన ఏపీలో జరిగింది. కేవలం 300 రూపాయల కోసం తలెత్తిన వివాదం ఒకరి ప్రాణం తీయడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో చోటు చేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.
చాట్లవానిపురం కు చెందిన సతీష్, వెంకటేశ్వరరావులు గత కొంతకాలం క్రితం కలివిడిగా ఉండేవారు. అయితే వెంకటేశ్వరరావు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం సతీష్ వద్ద రూ. 300 లు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ అప్పు వసూలు చేసుకునేందుకు, వెంకటేశ్వరరావు వద్దకు సతీష్ వెళ్ళాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఈనెల 20వ తేదీన ఇద్దరు ఘర్షణ కు పాల్పడగా కోపంలో, సతీష్ పై వెంకటేశ్వరరావు కర్రతో దాడి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన పాలైన సతీష్ ను కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు.
Also Read: Roja Comments: అరెస్ట్ కు రెడీ.. పెద్ద సవాల్ విసిరిన రోజా
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తీవ్ర గాయాల పాలైన సతీష్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేవలం రూ. 300 ల విషయంలో తలెత్తిన వివాదం, ఒకరి మృతికి దారి తీయడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. కోపంలో దాడికి పాల్పడిన, వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఎంత చింతించినా లాభం లేదని చెప్పవచ్చు. అందుకే ఆగ్రహం అనర్థదాయకం అంటారు పెద్దలు.
రూ. 300 విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ, వ్యక్తి మృతి
పామర్రు మండలం చాట్లవానిపురంలో ఘటన pic.twitter.com/WDxPAHzuHY
— ChotaNews (@ChotaNewsTelugu) December 26, 2024