Abhiram Daggubati: దగ్గుబాటి ఇంట సంబురాలు జరుగుతున్నాయి. దగ్గుబాటి ఇంటికి మహాలక్ష్మీ వచ్చింది. నిర్మాత సురేష్ బాబు, ఆయన తమ్ముడు హీరో వెంకటేష్ ఇద్దరు తాతలుగా మారారు. ఇక హీరో రానా.. పెదనాన్నగా ప్రమోట్ అయ్యాడు. సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ దగ్గుబాటి తండ్రి అయ్యాడు. అభిరామ్ భార్య ప్రత్యూష కొద్దిసేపటి క్రితమే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దగ్గుబాటి ఇంట వేడుకలు మొదలయ్యాయి.
అభిరామ్ వివాహం గతేడాది దగ్గర బంధువు అయినా ప్రత్యూష అనే అమ్మాయితో శ్రీలంకలో ఘనంగా జరిగింది. అనంతరం హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. రానా పెళ్లి తరువాతనే అభిరామ్ పెళ్లి చేసుకున్నా.. ముందు తమ్ముడే తండ్రి అయ్యాడు. అభిరామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Venkatesh: నేను పాడుతాను , నాకో అవకాశం ఇవ్వండి
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన అహింస అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే రానా అందుకున్నంత గుర్తింపు అభిరామ్ అందుకోలేకపోయాడు. ఈ మూవీ డైరెక్టర్ ని.. హీరోని కలిపి తెగ ట్రోల్ చేశారు. మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియనంత ఫాస్ట్ గా వచ్చి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా కన్నా ముందే ఈ కుర్రాడు వివాదాల్లో చిక్కుకున్న విషయం కూడా విదితమే.
నటి శ్రీరెడ్డితో అభిరామ్ రిలేషన్ లో ఉన్నాడని, అతడు ఆమెను వాడుకొని వదిలేశాడని శ్రీరెడ్డి న్యాయం కోసం రోడ్డెక్కి ఎంత రచ్చ చేసిందో అందరికీ తెల్సిందే. అభిరామ్ తో కలిసి దిగిన ఫోటోలు, చాట్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసి .. ఈ కుర్రాడి పరువు రోడ్డున పడేసింది. ఇక ఎలాగోలా ఈ వివాదం నుంచి అభిరామ్ బయటపడి.. గతేడాది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు.
Konidela Surekha: అల్లుడు బన్నీ కోసం మేనత్త కీలక నిర్ణయం..!
ప్రస్తుతం సినిమాలను వదిలి.. కుటుంబానికి సంబంధించిన ఫుడ్ రెస్టారెంట్స్ ను చూసుకుంటున్నాడని సమాచారం. ఇక అభిరామ్ తండ్రి అయ్యాడని తెలిసీ దగ్గుబాటి ఫ్యాన్స్ ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి అభిరామ్ సినిమాలను వదిలేశాడా.. ? లేక ముందు ముందు ఏమైనా మళ్లీ రీఎంట్రీ ఇస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.