BigTV English

Game Changer: ఫ్యాన్స్ కు దసరా కానుక.. గేమ్ చేంజర్ మూవీపై క్రేజీ అప్డేట్..

Game Changer: ఫ్యాన్స్ కు దసరా కానుక.. గేమ్ చేంజర్ మూవీపై క్రేజీ అప్డేట్..

Game Changer: ప్రస్తుతం టాలీవుడ్ లో తమకంటూ భారీ స్థాయి మార్కెట్, ఫాలోయింగ్ రెండు మైంటైన్ చేసే స్టార్ హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో మెగా హీరో రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ నట వారసుడిగా చిరుత మూవీ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తనదైన శైలిలో నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతి చిత్రంలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను ఎంచుకోవడమే కాకుండా తనకంటూ స్టాండర్డ్స్ ని సెట్ చేసుకొని వాటిని అచీవ్ చేస్తూ దూసుకు వెళ్తున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ గా బిరుదు తెచ్చుకొని వరల్డ్ వైడ్ ఫాన్స్ ను సంపాదించుకున్నాడు.


ఈ మూవీ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ కు ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ అప్ లో ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరక్షన్ లో నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రాబోతున్న రామ్ చరణ్ చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియర అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. 60 శాతం కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మిగిలిన పార్ట్ కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి మేకర్స్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు.

చెర్రీ మూవీ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు తాజాగా ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతుంది. నిజానికి గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా కాలం గడుస్తున్న ఇప్పటివరకు చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరి ఇంకా ఏది మేకర్స్ విడుదల చేయలేదు. కనీసం ఒక ప్రచార చిత్రము లేక పాట విడుదలవుతుందని ఆశించిన అభిమానులు నిరాశ చెందారు. అయితే దసరా కానుకగా రామ్ చరణ్ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ఒక న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఇంకా దీనికి డేట్ ఫిక్స్ కాలేదు.


అందిన సమాచారం ప్రకారం మరో రెండు మూడు రోజుల్లో గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల పై అధికారికంగా ప్రకటన కూడా వెలువబడుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రానికి మ్యూజిక్ ఎస్ థమన్ సమకూరుస్తున్నారు. శ్రీకాంత్, జయరాం, అంజలి ,రాజీవ్ కనకాల ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అన్ని ప్లాన్ ప్రకారం పూర్తి అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×